‘ పిన్నెల్లి ‘ కి జగన్ మద్దతు … ఈసీకి టీడీపీ ఫిర్యాదు ?
TeluguStop.com
ఏపీలో టిడిపి, వైసిపిల ( TDP , YCP )మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతూనే ఉంది.
ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలో9కి వచ్చిన తర్వాత వైసిపి శ్రేణులపై దాడులు పెరిగిపోయాయని , నిన్ననే వైసిపి అధినేత జగన్ విమర్శలు చేశారు.
నెల్లూరు సెంట్రల్ జైల్ లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన జగన్ అనంతరం మీడియా సమావేశంలో అనేక సంచలన ఆరోపణలు చేశారు.
ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంల ధ్వంసం వ్యవహారం పైన జగన్ మాట్లాడారు.సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ రోజున అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ( MLA Pinnelli Ramakrishna Reddy )పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లోకి వెళ్లి , ఈవీఎం ను ద్వంసం చేశారు.
ఈ కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో ఆయన అరెస్టు చేసి రిమాండ్ కి పంపించారు.
ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్ లో ఉన్నారు.పిన్నెల్లి ని పరామర్శించేందుకు వెళ్లి జగన్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
"""/" /
ఈవీఎంలను ధ్వంసం చేయడం తప్పే కాదన్నట్లుగా జగన్ మాట్లాడడం పై టీడీపీ, జనసేనలు( TDP , Janasena ) అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.' గ్రామంలో ఉన్న ఎస్సీలు ఓటు వేసే పరిస్థితి లేకపోవడంతో , మా ఎమ్మెల్యే ఎస్పీకి ఫోన్ చేసినా స్పందన లేక పోయింది.
సునీతమైన ఏరియాలో ఉన్న ఆ బూత్ లో కేవలం ఒక హోమ్ గార్డ్ ను సెక్యూరిటీగా పెట్టారు.
అక్కడ అన్యాయం జరుగుతుండడంతో, ఎమ్మెల్యే లోపలికి వెళ్లి ఈవీఎం పగలగొట్టాడు.వైసీపీకే ఓట్లు పడుతుంటే ఎమ్మెల్యే వెళ్లి ఈవీఎం ను పగలగొట్టాల్సిన అవసరం ఏముంది ? అక్కడికి వెళ్ళినప్పుడు జరుగుతున్న అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు .
ఈ కేసులో బెయిల్ కూడా వచ్చింది.ఇవాళ తను లోపల ఉంది ఈవీఎం ను పగలగొట్టిన కేసులో కాదు ' అంటూ జగన్ మాట్లాడిన వ్యాఖ్యలపైనే టిడిపి జనసేన విమర్శలు చేస్తోంది .
"""/" /
జగన్ మానసిక పరిస్థితి సరిగా లేదని , అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు.
ఈవీఎం ద్వంసం వ్యవహారంపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు టిడిపి సిద్ధం అవుతోంది.
ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ , మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ( Jagan )ఈవీఎం ను ధ్వంసం చేయడాన్ని సమర్థించేలా చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లాలని టిడిపి నిర్ణయించింది.
ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల సంఘం అధికారులను కలిసి జగన్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ తో సహా ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతోంది.
బకింగ్‌హామ్ ప్యాలెస్ పనిమనిషి అరెస్ట్.. ఏం తప్పు చేసిందో తెలిస్తే..