అమరావతి పరిధిలో జగన్ స్కెచ్ ! ఆ ఇద్దరికీ ఇబ్బందే ?
TeluguStop.com
ప్రస్తుతం అమరావతి వ్యవహారంపై ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.
అమరావతిని టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, రాజధాని ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉండడం వంటి కారణాలతో 2019 నుంచి అమరావతి వ్యవహారం రచ్చ అవుతూనే ఉంది.
అయితే ఈ అమరావతి పరిధిలోని మంగళగిరి తాడికొండ నియోజకవర్గంలో 2019లో వైసీపీ విజయం సాధించింది.
కానీ 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా మంగళగిరి తాడికొండ నియోజకవర్గం లో గెలిచి తీరాలి అనే పట్టుదలతో ఉంది.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమరావతి పరిధి లోని మంగళగిరి నుంచి పోటీ చేయబోతుండగా, తాడికొండ నుంచి శ్రవణ్ కుమార్ ను టిడిపి పోటీకి దింపుతోంది.
దీంతో అధికార పార్టీ వైసీపీ కూడా అలర్ట్ అయింది.ఈ రెండు సిట్టింగ్ స్థానాలను మళ్ళీ గెలుచుకుని అమరావతి సెంటిమెంట్ జనాల్లో లేదనే విషయాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యేగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ( Alla Ramakrishnareddy )ఉందగా, తాడికొండ ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి ( Undavalli Sridevi )ఉన్నారు.
ఇప్పటికే శ్రీదేవిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఆమె వ్యవహరిస్తున్నారు.
"""/" /
అమరావతి సెంటిమెంట్ ను లక్ష్యంగా చేసుకుని టిడిపి 2024 ఎన్నికలను ఈ పరిధిలో ఉన్న తాడికొండ , మంగళగిరి నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను వైసిపి అమలు చేస్తుంది.
ఇక్కడ ఓటు బ్యాంకును మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంది .దీనిలో భాగంగానే రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది .
51 మంది లబ్ధిదారులకు ఒకేసారి పట్టాలను పంపిణీ చేయబోతున్నారు.ఈ 51 వేల మంది కుటుంబాలలో రెండు లక్షల మంది ఉంటారని, వీరిలో 1,50,000 మంది ఓటర్లు ఉంటారని వైసిపి అంచనా వేస్తుంది.
రాబోయే ఎన్నికల్లో వీరంతా వైసీపీకి అనుకూలంగానే ఓట్లు వేస్తారని నమ్మకంతో ఉంది. """/" /
దాదాపు 80 వేల మంది మంగళగిరి( Mangalagiri ) నియోజకవర్గంలో ఉండగా, మిగిలిన వారు తాడేపల్లి నియోజకవర్గ పరిధిలోకి వస్తారు.
ఇప్పుడు ఇవ్వబోతున్న 51 వేల పట్టాలను అందించగానే , టిడ్కో పథకం కింద జగనన్న కాలనీలో ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నారు.
పట్టాలు ఇచ్చి జగనన్న కాలనీలు ఏర్పాటు చేసే సమయానికి ఎలాగో ఎన్నికలు వస్తాయి కాబట్టి, వైసిపికి అనుకూలంగానే వీరు ఓట్లు వేస్తారనే నమ్మకంతో అధికార పార్టీ వైసిపి ఉంది.
ఈ రెండు నియోజకవర్గల్లో తమ విజయానికి ఎటువంటి డొఖా లేకుండా చేసుకునే విధంగా వైసిపి ప్లాన్ చేసుకుంటుంది.
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!