ఎమ్మెల్యే ల పై వ్యతిరేకత జగన్ ఇలా పోగొడుతున్నారా ? 

తాను ఎంతగా ప్రజా సంక్షేమ పథకాల కోసం ఆలోచించి, అమలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపై ఈ వ్యతిరేకత పెరిగితే 2024 ఎన్నికల్లో ఆందోళన వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్ లో కనిపిస్తోంది.

అందుకే ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తగ్గించడంతో పాటు,  పూర్తి స్థాయిలో పార్టీ నాయకులు ప్రజా క్షేత్రంలో తిరిగే విధంగా జగన్ సరికొత్త ఎత్తుగడ వేశారు.

ఇప్పటి వరకు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొనడం, సొంత వ్యాపారాలు చక్కబెట్టుకోవడం ,ఎన్నికల సమయంలో చూసుకుందాం అన్నట్లు గా వ్యవహరించడం , ఇలా అనేక విధాలుగా నిర్లక్ష్యం వహిస్తూ ఉండడం వంటి వ్యవహారాలు జగన్ దృష్టికి వెళ్లాయి.

        అసలు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి చెలారగడానికి కారణం వాలంటరీ వ్యవస్థ.ప్రజా ప్రతినిధుల ప్రమేయం లేకుండానే , ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందుతూ ఉండటం,  తదితర అంశాలలో ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులకు అసంతృప్తి ఉంది.

అయితే ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాలంటరీ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడంతో దీనిపై వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎటువంటి విమర్శలు చేయలేని పరిస్థితుల్లో సైలెంట్ అయిపోయారు.

ఎమ్మెల్యేలు పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోతే, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది అనే విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.

    """/"/   అందుకే ఇకపై ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని రెండు సచివాలయాల ను వారంలో  తప్పనిసరిగా సందర్శించాలి అనే నిబంధనలు విధించారు.

తాను కూడా త్వరలో రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామ సచివాలయాలు సందర్శించాలి అని జగన్ ఎమ్మెల్యేలకు సూచించారట.

దీంతో ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యి సచివాలయాల బాట పడుతూ,  గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకుంటూ స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారట.

అయితే ఇంత అకస్మాత్తుగా జగన్ ఈ విషయంపై దృష్టి పెట్టడానికి కారణం ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ కారణంగా తెలుస్తోంది.

ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా వారికి గ్రేడ్లు కేటాయించాలని,  వాటి ఆధారంగానే రాబోయే ఎన్నికల్లో వారికి టికెట్లు కేటాయింపు లో ప్రాధాన్యమివ్వాలనేది జగన్ అభిప్రాయంగా కనిపిస్తోంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షురూ.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?