టీడీపీ కంచుకోటపై జగన్ మాస్టర్ ప్లాన్ ?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వేడి పరుగుతోంది.ముఖ్యంగా ప్రధాన పార్టీల మద్య వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తుకు పై ఎత్తులు సాగుతున్నాయి.

వచ్చే ఎన్నికలతో మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ భావిస్తుంటే.ఈసారి ఎలాగైనా వైసీపీని గద్దె దించి తాము అధికారంలోకి రావాలని టీడీపీ( TDP ) శ్రేణులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రెండు పార్టీల మద్య ఎలక్షన్ వార్ గట్టిగానే ఓ రేంజ్ లో సాగుతోంది.

కాగా ఈసారి ఈ రెండు పార్టీలు కూడా ప్రత్యర్థి స్థానాలపై కన్నెశాయనే చెప్పాలి.

కడప, కర్నూల్, ప్రకాశం వంటి జీలల్లో వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ భావిస్తుంటే, చిత్తూరు, అనంతపురం వంటి జిల్లాల్లో టీడీపీకి చెక్ పెట్టాలని వైసీపీ భావిస్తోంది.

ముఖ్యంగా అధికార వైసీపీ మాత్రం ప్రత్యర్థి టీడీపీ స్థానాలపై కాస్త గట్టిగానే ఫోకస్ చేస్తునట్లు తెలుస్తోంది.

"""/" / టీడీపీ కంచుకోటలుగా ఉన్న కుప్పం, హిందూపురం( Kuppam ) వంటి నియోజిక వర్గాల్లో ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేయాలని జగన్ పట్టుదలగా ఉన్నారు.

అందుకోసం కుప్పంలో ఇప్పటికే గ్రాండ్ వర్క్ కూడా మొదలుపెట్టారు.ఇక హిందూపురం విషయానికొస్తే.

ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినది మొదలుకొని టీడీపీ తప్పా వేరే పార్టీకి చోటు లేదు అన్నట్లుగా ఆ పార్టీ విజయం సాధిస్తూ వస్తోంది.

సీనియర్ ఎన్టీఆర్ కు ఇక్కడ వీరాభిమానులు ఉండడంతో పాటు నందమూరి వంశానికి ఈ ప్రాంత ప్రజలు ఎంతో విధేయత చూపుతూ ఉంటారు.

"""/" / అందుకే 2014 లోనూ అలాగే 2019 లోనూ నందమూరి బాలకృష్ణను హిందూపురం నుంచి రెండు సార్లు పోటీ చేసి గెలుపొందారు.

అయితే ఈసారి ఈ స్థానంలో బాలకృష్ణ కు చెక్ పెట్టేందుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

బకాకృష్ణకు అపోజిట్ గా ఎవరిని బరిలో దింపిన ఓటమి తప్పదని భావించిన జగన్ ఈసారి లక్ష్మి పార్వతి( Lakshmi Parvathi )ని హిందూపూర్ బరిలో దించితే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచిస్తున్నారట.

దివంగత నేత ఎన్టీ రామారావు భార్యగా లక్ష్మి పార్వతి పై ప్రజల్లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని, సీనియర్ ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణపై చంద్రబాబు పై నిప్పులు చెరిగే లక్ష్మి పార్వతి అయితేనే కరెక్ట్ అని జగన్ భావిస్తున్నారట.

ఇదే గనుక నిజం అయితే ఈసారి హిందూపూర్ బరిలో నందమూరి వర్సస్ నందమూరి గా వార్ కొనసాగే అవకాశం ఉంది.

మరి ఏం జరుగుతుందో చూడాలి.

తరచూ స్వీట్స్ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!