ముందస్తు ఎన్నికలపై జగన్ మాస్టర్ ప్లాన్?

నిన్న మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదన్న మాట వినిపించింది.

అయితే రాష్ట్రంలోనూ, కేంద్రం లోనూ జరుగుతున్న పరిస్థితులు శరవేగంగా మారుతున్న పరిణామాలను చూస్తుంటే ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు అన్న వాతావరణం కనిపిస్తుంది.

ముఖ్యంగా కేంద్రం కూడా జమిలీ ఎన్నికల( One Nation One Election ) వైపు దృష్టి సారిస్తుండడంతో ఎన్నికలు నిర్ణయించిన షెడ్యూల్ కన్నా ముందే వస్తాయన్న అంచనాలు ఉండగా, తాము మాత్రం చివరి రోజు వరకూ అధికారం లో ఉంటామని ఇంతకుముందు చాలా సార్లు చెప్పిన ముఖ్యమంత్రి జగన్( CM Ys Jagan ) ఇప్పుడు ఆంధ్రలో ఉన్న రాజకీయ పరిస్థితులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది .

"""/" / ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) తరువాత తీవ్ర స్థాయి ప్రజా వ్యతిరేకత వస్తుందని ఊహించినప్పటికీ ప్రజల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో తెలుగుదేశానికి ఇక పుంజుకునే అవకాశం ఇవ్వకూడదని, ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణల్లో సాక్షాదారాలను సంపాదించి ఉన్నందున వాటన్నిటిని అస్త్రాలుగా సంధించి చంద్రబాబు రిమాండ్ ను పొడిగించేలా ప్రయత్నాలు చేయాలని, కనీసం ఐదారు నెలలపాటు చంద్రబాబుని జైలు గోడల మధ్య ఉండేలా చేస్తే ఆ పార్టీకి ఇక ఎన్నికలకు సిద్ధమవడానికి అవకాశం ఉండదని ఈ సమయాన్ని ఉపయోగించుకొని ముందస్తుకు వెళ్లాలని జగన్ చూస్తున్నారంటూ కొంతమంది రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

నాయకుడు లేని సేన ఎక్కువకాలం నిలబడదని చంద్రబాబు లాంటి అపర చాణక్యుడు జైలు గోడల మధ్య ఉంటే ఆ ప్రభావం తెలుగుదేశం పై భారీ ఎత్తున ఉంటుందని వైసీపీ అధిష్టానం అంచనా కడుతున్నట్లుగా తెలుస్తుంది.

"""/" / ఇలాంటి కీలక సమయాన్ని ఉపయోగించుకొని శరవేగంగా ఎన్నికలకు సిద్ధమవ్వాలని జగన్ చూస్తున్నారని, అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లుగా జగన్ ప్రకటించే అవకాశం ఉందని ఆ వార్తల సారాంశం.

అయితే కేంద్రంతో మంచి సంబంధాలు నడిపే జగన్ కేంద్ర పెద్దల అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరని అసెంబ్లీ సమావేశాల తర్వాత ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకొని పూర్తిస్థాయిలో చర్చలు జరిపిన తర్వాతే ఏ విషయాన్ని ప్రకటిస్తారని అప్పటివరకు వస్తున్న విషయాలన్నీ కేవలం ఊహాగానాలే అంటూ కొంతమంది కొట్టి పడేస్తున్నారు .

కెనడా : భారతీయ దౌత్యవేత్తలే టార్గెట్.. మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల నిరసన