చంద్రబాబు పులి అయితే మరి జగన్.. ?

ఈ మద్య ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) పంచతంత్ర కథలను బాగా వినిపిస్తున్నాడు.

గత కొన్నాళ్ళ నుంచి తను సింహాన్ని అని నక్కలంతా ఏకమౌతున్నాయని, అయితే సింహం సింగిల్ గానే పోరాడుతుందని.

ఇలా ఓ కథ వినిపించే వారు.అంటే వచ్చే ఎన్నికల్లో తాను ఒంటరిగా పోటీ చేస్తుంటే.

ఓటమి భయంతో టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు కోసం వెంపర్లాడుతున్నాయనే అర్థం వచ్చేలా జగన్ ఆ కథ వినిపించేవారు.

ఇక వైసీపీ నేతలు కూడా తమ నాయకుడు సింహం అని సింగిల్ గానే బరిలోకి దిగుతారని.

ఇలా జగన్మోహన్ రెడ్డిపై భజన వర్షం కురిపించడం చూస్తూనే ఉంటాం. """/" / అయితే ఈ కథలు ఎలగున్న అంతిమ సారాంశం మాత్రం ఒకటే.

టీడీపీ, జనసేన పొత్తును నిర్వీర్యం చేయడం.వైసీపీ( YCP ) ఎందుకు భయపడుతుందో అది జరిగి తీరుతుందని టీడీపీతో పొత్తు పై క్లారిటీ ఇచ్చారు పవన్.

దాంతో పొత్తు విషయంలో వైసీపీ కూడా దాదాపుగా విమర్శలు చేయడం ఆపేసింది.ఇక తాజాగా మరోసారి జగన్మోహన్ రెడ్డి పంచతంత్ర కథను మళ్ళీ బయటకు తీసుకొచ్చారు;.

ఈసారి కాస్త డిఫరెంట్ గా చంద్రబాబు నాయుడును( Chandrababu Naidu ) పులితో పోలిస్తూ కథ వల్లించారు.

"""/" / ఒక ముసలి పులి వేట కోసం నాలుగు తోడేల్లలాంటి నక్కలను జతచేసుకుందని, అయితే పులి అసలు ప్లాన్ తనను నమ్మిన తోడేళ్లను తినడమే అనే అర్థం వచ్చేలా కథ వల్లించారు.

ఇటీవల చంద్రబాబు జాతీయ మీడియాలో మాట్లాడుతూ మోడి పాలనపై( Narendra Modi ) ప్రశంశల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.

దీంతో బిజెపితో పొత్తు కోసమే చంద్రబాబు మోడి పై ప్రశంశలు కురిపించాడనేది వైసీపీ నుంచి వినిపిస్తోన్న మాట.

"""/" / ఇప్పటికే జనసేనను కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఇప్పుడు బీజేపీని కూడా కాకా పడుతున్నారనేది వైసీపీ వర్గంలో వినిపిస్తున్న మాట.

అయితే అటు జనసేన ఇటు బీజేపీ పార్టీలను కేవలం తన రాజకీయ వ్యూహంలో భాగంగానే చంద్రబాబు ఉపయోగించుకుంటారని తన అవసరం తీరాక రెండు పార్టీలను పక్కన పెడతారని అర్థం వచ్చేలా జగన్ వల్లించిన కథ ఉన్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల ముందు కూడా చంద్రబాబు అంతకుముందు పొత్తులో ఉన్న ఎన్డీయే నుంచి అనూహ్యంగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

అదే విధంగా ఇప్పుడు కూడా తన రాజకీయ వ్యూహం కోసం జనసేన, బీజేపీ పార్టీలతో చంద్రబాబు జతకలిసిఎందుకు సిద్దమయ్యారనేది అందరికీ తెలిసిన సత్యం.

మొత్తానికి ఈ మద్య టీడీపీ టార్గెట్ గా సి‌ఎం జగన్ వాళ్లిస్తున్న పంచతంత్ర కథలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.

పుష్ప 2 హీరో దొంగ కాకపోతే దేవుడా…. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై బన్నీ షాకింగ్ రియాక్షన్?