నేడు జగన్ కీలక సమావేశం ! వైసీపీ లో టెన్షన్ టెన్షన్
TeluguStop.com
వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( CM Jagan ) ఈరోజు పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు , ఎంపీలు, నియోజకవర్గాల ఇన్చార్జీలతో ఉదయం 11:30 నిమిషాలకు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు.
ఈ సమావేశంపై వైసీపీలో ఉత్కంఠ నెలకొంది.దీనికి కారణం ఈ సమావేశంలో జగన్ కొంతమంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉండడమే కారణం.
దీంతోపాటు ఇటీవల వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పైన జగన్ విశ్లేషణ చేయబోతున్నారు.
అలాగే ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయంటూ గత కొద్దిరోజులుగా హడావుడి జరుగుతుండడం తో దీనిపైన జగన్ క్లారిటీ ఇవ్వబోతున్నారు.
అలాగే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వినూత్న కార్యక్రమాలను జగన్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో( Mlc Elections ) ఓటమి, ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తదితర పరిణామాల తరువాత జరగబోతున్న సమావేశం కావడంతో జగన్ ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు .
? ఎవరికి గట్టిగా క్లాస్ పీకుతారు అనేది అందరికీ టెన్షన్ పుట్టిస్తోంది. """/" /
దీంతోపాటు మంత్రివర్గ విస్తరణ పైన జగన్ ఈ సమావేశంలో వెల్లడించబోతున్నారట .
తాను ఏ పరిస్థితుల్లో మూడో విడత విస్తరణకు సిద్ధమవుతున్నాను అనేది జగన్ చెప్పబోతున్నారట.
ప్రస్తుతం ఉన్న మంత్రుల టీం తో ఎన్నికలకు వెళితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని గ్రహించిన జగన్ బలమైన నాయకులు, రాజకీయ ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేయగల వ్యక్తులకు ఇప్పుడు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చూస్తున్నరట.
దీంతో పాటు సామాజిక వర్గాల లెక్కలు వేసుకుని క్యాబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తున్నారట.
"""/" /
గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం పై సమీక్ష అని చెబుతున్న ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి మంత్రివర్గ విస్తరణ నియోజకవర్గం ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది వంటి వాటిపై జగన్ ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారట.
దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో నెలకొన్న గ్రూపు రాజకీయాల పైన జగన్ స్పందించబోతున్నారట.
అలాగే జనాలకు చేరువయ్యేందుకు ఏం చేయాలి అనే దానిపైన జగన్ ప్రసంగించబోతున్నారట.దీంతో ఈ సమావేశంపై వైసీపీ( YCP )లో ఉత్కంఠ నెలకొంది.
ఇకపై ఆదివారాలు పెట్రోల్ బంకులు పనిచేయవా? నిజమెంత?