పిఠాపురం తో ముగించేయనున్న జగన్ 

మరో రెండు రోజుల్లో జరగనున్న పోలింగ్ లో కచ్చితంగా గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan) రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ, జనాల్లో వైసిపి పై ఆదరణ మరింత పెంచే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు.

తన పర్యటనలో రాజకీయ ప్రత్యర్థులపై పదునైన విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నారు.టిడిపి ఇచ్చిన హామీలు మాటల వరకే పరిమితం అని ,తాను ఇచ్చిన హామీలు ఇప్పటికే అమలు చేసిన తీరు మీరంతా చూశారని, మళ్ళీ అధికారంలోకి వస్తే మరింత మెరుగ్గా పరిపాలన అందించడంతో పాటు, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు జనాలకు అందిస్తామని జగన్ చెబుతున్నారు.

జనవరి 28న ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన జగన్ ఉత్తరాంధ్ర వేదికగా దీనిని ప్రారంభించారు.

మొదటగా నాలుగు సిద్ధం సభలతో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ, ప్రకాశం జిల్లాలో సభలు నిర్వహించారు.

"""/" / విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం లో సిద్ధం సభతో ఎన్నికల సమర శంఖం పూరించారు ఆ తరువాత ఏలూరు జిల్లా దెందులూరు లో రెండో సభ, రాయలసీమలోని అనంతపురం జిల్లా రాప్తాడు లో మూడో సిద్ధం సభ, బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా నాలుగో సిద్దం సభ భారీగా నిర్వహించి సక్సెస్ అయ్యారు.

వీటి తర్వాత మేమంతా సిద్ధం పేరుతో 22 రోజులు పాటు 200 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర నిర్వహించారు.

దాదాపు 86 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగింది.17 బహిరంగ సభల్లో జగన్ పాల్గొన్నారు.

 వాడి వేడిగా జరిగిన ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది.ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచార ఘట్టం ముగియనుంది.

ఈ చివర రోజున జగన్ సుడిగాలి పర్యటన చేయనున్నారు. """/" / మూడు నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

పిఠాపురంలో చివరి సభను నిర్వహించి అక్కడితో ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.ఈరోజు ఉదయం 10 గంటలకు చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు తరఫున ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొన్నారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు కైకలూరులో వైసిపి అభ్యర్థి దూలం నాగేశ్వరరావు తరఫున ప్రచారంలో పాల్గొని ప్రసంగిస్తారు ఆ తరువాత మధ్యాహ్నం మూడు గంటలకు పిఠాపురం( Pithapuram )లో జగన్ పర్యటిస్తారు వైసిపి అభ్యర్థి వంగగీత తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొని అక్కడితో ప్రచార పర్వానికి ముగింపు పలుకుతారు.

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పోటీ చేస్తుండడంతో ఆయన టార్గెట్ జగన్ పదునైన ప్రసంగాలు చేసే అవకాశం కనిపిస్తోంది.

వీడియో: వీడేం బైకర్ రా బాబు.. బస్సును బోల్తా కొట్టించాడు.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!