వైసీపీ జిల్లా అధ్యక్షులను మార్చనున్న జగన్ ! కారణం ఇదే 

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీలో సమూల మార్పులు చేపట్టేందుకు వైసిపి అధిష్టానం నిర్ణయించుకుంది.

ఒకపక్క ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతూనే, మరోపక్క పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే విషయంపై దృష్టి సారించింది.

ప్రస్తుతం టిడిపి , జనసేన పార్టీలు( TDP Janasena Parties ) పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో,  ఈసారి జరగబోయే ఎన్నికలు ఆషామాషీగా ఉండవని జగన్ భావిస్తున్నారు.

  సర్వేలన్నీ అనుకూలంగానే ఉన్నా,  క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం కావాలనే విషయాన్ని గుర్తించారు.

దీనిలో భాగంగానే పార్టీ జిల్లా అధ్యక్షులను మార్చాలని జగన్( CM Jagan ) నిర్ణయించుకున్నారు.

పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్న జిల్లా అధ్యక్షులను మార్చి , వారి స్థానంలో యాక్టివ్ గా ఉన్న నాయకులకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నారు.

దీంతో పాటు జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే లను తప్పించబోతున్నట్లు సమాచారం.

"""/" / ప్రస్తుత ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో తమ నియోజకవర్గాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన నేపథ్యంలో , వారికి ఈ బాధ్యతలు ఇబ్బందికరంగా కాకుండా చూడాలని జగన్ ( CM Jagan )నిర్ణయించుకున్నారు.

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి (చిత్తూరు ), గడికోట శ్రీకాంత్ రెడ్డి (అన్నమయ్య జిల్లా), శంకరనారాయణ (సత్యసాయి జిల్లా), కాటసాని రాంభూపాల్ రెడ్డి (నంద్యాల జిల్లా), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పల్నాడు జిల్లా), వెల్లంపల్లి శ్రీనివాస్ (ఎన్టీఆర్ జిల్లా), పేర్ని వెంకట రామయ్య (కృష్ణాజిల్లా, ఆళ్ల నాని( ఏలూరు జిల్లా), జక్కంపూడి రాజా (తూర్పుగోదావరి జిల్లా), చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు (పశ్చిమగోదావరి జిల్లా), పొన్నాడ వెంకట సతీష్ కుమార్ (కోనసీమ జిల్లా) కురసాల కన్నబాబు (కాకినాడ జిల్లా), కే భాగ్యలక్ష్మి (అల్లూరి సీతారామరాజు జిల్లా), బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

వీరిని తప్పించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. """/" / ఈ మేరకు పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ),  విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి , మిధున్ రెడ్డిలతో జగన్ సమావేశమై ఈ నియామకాలతో పాటు,  ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ల ఎంపిక పైన చర్చించారు.

మరి కొద్ది రోజుల్లోనే జిల్లా అధ్యక్షుల మార్పు పై ప్రకటన వెలువడనుంది

వర్షాకాలంలో బీరకాయ తింటున్నారా.. లేకుంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!