పరిస్థితి చేయిదాటుతోంది .. జగన్ అలా చేయాల్సిందేనా ? 

వైసీపీలో( YCP ) పరిస్థితి చేయి దస్తుతున్నట్టు గా కనిపిస్తోంది.గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ కు( Jagan ) అత్యంత సన్నిహితులుగా మెలిగిన వారు , కీలక పదవులు అనుభవించిన వారు ఎంతోమంది ఇప్పుడు టిడిపి,  జనసేన లో( Janasena ) చేరిపోతున్నారు.

వైసీపీలో ఉండి ఇబ్బందులు ఎదుర్కోవడం కంటే,  అధికార పార్టీలో చేరితే అన్ని విధాలుగా లాభం అనే ఆలోచనతో చాలామంది నాయకులు వైసిపిని వీడివెళ్తున్నారు.

ఇటీవల కాలంలో ఈ వలసలు జోరందుకున్నాయి.కీలక నాయకులంతా పార్టీని వీడి వెళ్లిపోతుండడంపై వైసిపి నాయకులు , కార్యకర్తలలోను ఆందోళన కలుగుతుంది.

అయినా జగన్ మాత్రం ఈ విషయంలో సైలెంట్ గానే ఉంటున్నారు. """/" / పార్టీకి డేంజర్ బెల్స్ మోగుతున్న నేపథ్యంలో జగన్ తనను తాను మార్చుకోవడంతోపాటు,  పార్టీ నేతలు ఎవరు ఇతర పార్టీలలో చేరకుండా,  వారిలో భరోసా నింపే ప్రయత్నాలను మొదలు పెట్టాల్సి ఉంటుంది.

గత వైసిపి ప్రభుత్వం లోను ఎన్నికలకు ముందు జగన్ తీసుకున్న నిర్ణయాలు చాలావరకు వైసీపీకి డామేజ్ చేసాయనే చెప్పాలి.

ఒక నియోజకవర్గ నేతను మరో నియోజకవర్గంలో ఇన్చార్జిగా నియమించి పోటీ చేయించడం వంటి ప్రయోగాలు బెడిసి కొట్టాయి.

  అలాగే కార్యకర్తలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా వాలంటీర్లు,  అధికారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వంటివి ఎన్నికల్లో కొంపముంచాయి.

ఈ నేపథ్యంలో జగన్ మార్పు దిశగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది.

"""/" / రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది .

పార్టీని మరింతగా జనాల్లోకి తీసుకువెళ్లడంతో పాటు,  పార్టీ నాయకులు,  కార్యకర్తలలో భరోసా నింపే విధంగా జగన్ వ్యవహరించాల్సి ఉంటుంది.

ఎన్నికల్లో ఓటమి పరాభం నుంచి జగన్ చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది .

ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా జనాల్లోకి తీసుకువెళ్లడం , గత వైసిపి ప్రభుత్వం లో ప్రజలకు జరిగిన మేలు వంటివన్నీ లెక్కలతో సహా ప్రజలకు అర్థమయ్యేలా తీసుకువెళ్లడం, ముందు ముందు కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా తాను వ్యవహరించబోతున్నాననే సంకేతాలను జగన్ పంపాల్సి ఉంటుంది.

వలసలకు బ్రేక్ పడే విధంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టడంతోపాటు,  పార్టీ వీడలనుకునే  నాయకులను బుజ్జగించడం, ఎప్పటి నుంచో చాలా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు మధ్య ఉన్న గ్రూపు రాజకీయాలను , విభేదాలను పరిష్కరించి అందర్నీ సమన్వయం చేసుకుని వెళ్లేలా జగన్ వ్యవహరిస్తూ ముందుకు వెళ్తేనే ప్రస్తుత పరిస్థితిని కొంతవరకైనా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.