జగన్ ను ఆదుకునే వారే లేరా ? 

అదేంటో కాని ఏపీ సీఎంగా జగన్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి వరుసగా అన్ని కష్టాలే అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,  తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా దేశవ్యాప్తంగా ఆదర్శనీయమే.

వైసిపి ప్రతిపక్షంలో ఉండగా జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుని,  వారి కష్టాలను దూరం చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని మార్గాలను మేనిఫెస్టో రూపొందించి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేశారు.

  అసలు జగన్ మేనిఫెస్టో ఒక సంచలనం.  దానిని అమలు చేయడం అసాధ్యం అంటూ అప్పట్లో వైసిపి రాజకీయ ప్రత్యర్థులు పెదవి విరిచారు.

కానీ, జగన్ మొండి పట్టుదలతో అధికారంలోకి వచ్చిన రెండేళ్ల సమయం లోనే సంక్షేమ పథకాలను దాదాపుగా అమలుచేశారు.

  మరెన్నో కొత్త పథకాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.కానీ ఏపీ ఆర్థిక పరిస్థితి  మాత్రం జగన్ కు తీవ్ర ఆటంకాలు కలిగిస్తోంది.

 ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా వైరస్ ప్రభావం ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం,  దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడటం తో ఏపీ సైతం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడింది.

దీనికితోడు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం, ఆ తరువాత వర్తక వాణిజ్య వ్యవహారాల పై అనేక ఆంక్షలను విధించాల్సి రావడం ఇవన్నీ ఏపీ ఆర్థిక పరిస్థితిని మరింతగా దిగజార్చాయి.

ఒక వైపు సంక్షేమ పథకాలు ఆగిపోకుండా వాటిని అమలు చేయడం జగన్ కు సవాల్ గా మారింది.

దీనికి తోడు  ప్రకృతి వైపరీత్యాలు మరింత ఇబ్బంది పెట్టాయి.ఇవన్నీ ఇలా ఉండగానే మరో వైపు ఉద్యోగ సంఘాలు కూడా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆందోళన చేయడంతో పాటు,  ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాడు ప్రస్తుతం ఏపీ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం సాధ్యమయ్యే పని కాదు దానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడం జగన్ కు.

  """/"/  పెద్ద సవాలే ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు,  మరోవైపు సంక్షేమ పథకాలు,  ఇంకోవైపు ఉద్యోగ సంఘాల హెచ్చరికలు , ఇలా ఎన్నో సమస్యలతో జగన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏపీ ఆర్థిక కష్టాలు కొంతవరకు తీర్చేందుకు కేంద్రం పరోక్షంగా సహకారం అందిస్తున్న,  పూర్తిస్థాయిలో ఏపీకి నిధులు కేటాయింపు విషయంలో కేంద్రం మరింత సానుకూలంగా స్పందించకపోతే,  రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం జగన్ కు మరింత ఇబ్బందులు కలిగించవచ్చు.

ఎంత రిస్క్ తీసుకోవడానికి అయినా సిద్ధమవుతున్న టాలీవుడ్ స్టార్ హీరోలు.. కారణమేంటి ?