విదేశీ టూర్ కి జగన్ ! ఏపీలో రచ్చ రచ్చే 

ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, అధికార పార్టీ వైసిపి( Ycp ) దూకుడు పెంచింది.

జనాల్లోకి పార్టీని తీసుకువెళ్లే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.ప్రస్తుతం ఇంటింటికి వైసీపీ శ్రేణులు వెళ్తూ , ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు,  వాటిపై ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటూనే,  మా నమ్మకం నువ్వే జగన్ ( Jagan )పేరుతో స్టిక్కర్లు ఆంటించే కార్యక్రమం హోరా హోరీగా జరుగుతుంది.

దీనికి కౌంటర్ గా టీడీపీ ,  జనసేన పార్టీలు పోటా పోటీగా స్టిక్కర్లు అంటిస్తున్నాయి.

ఈ రాజకీయ వాతారణం ఇలా  వేడెక్కిన సమయంలోనే,  తాజాగా వైసీపీ అధినేత,  ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )విదేశీ పర్యటనకు కుటుంబ సమేతంగా వెళ్ళనున్నారు.

"""/" / ప్రస్తుతం పార్టీ,  ప్రభుత్వ కార్యక్రమాలతో జగన్ తీరిక లేకుండా ఉన్నారు.

అయినా కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లేందుకు జగన్ సిద్ధం అవుతున్నారు.నాలుగు రోజుల పాటు జగన్ విదేశాల్లోనే ఉంటారు.

ఈ మేరకు ఈ నెల 21 న జగన్ ,ఆయన భార్య వైఎస్ భారతి, కుమార్తె హర్ష రెడ్డి, వర్షా రెడ్డి తో కలిసి వ్యక్తిగత పర్యటనకు జగన్ వెళ్తున్నారు.

అయితే ఎక్కడికి జగన్ వెళ్తున్నారు ? ఎందుకు వెళ్తున్నారు అనేది సీక్రెట్ గానే ఉంది.

వైసిపి అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో జగన్ విదేశీ పర్యటనలకు వెళ్ళింది అతి తక్కువ.

2019లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజుల తర్వాత జెరూసలేం వెళ్లారు .

అక్కడ కుటుంబ సభ్యులతో నాలుగు రోజుల పాటు పర్యటించి వచ్చారు.ఆ తరువాత అమెరికా వెళ్లారు.

"""/" / డల్లాస్ లో ప్రవాసనందులతో జగన్ సమావేశం అయ్యారు.గత ఎడాది స్విజ్జర్ లాండ్ లోని దావోస్ లో పర్యటించారు.

ఎకనామిక్ ఫోరం ఏర్పాటు చేసిన ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు.మళ్లీ ఇప్పుడు కుటుంబం సమేతంగా విదేశాలకు వెళుతుండడం హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉంటే కీలకమైన సమయంలో జగన్ విదేశీ పర్యటనకు వెళుతుండడంతో,  ఇదే అనువైన సమయంగా విపక్షాలు ఏపీలో రాజకీయ రచ్చ రేపేందుకు సిద్ధమవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అమెరికా : త్వరలో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌.. భారత సంతతి లాయర్‌కు లక్కీ ఛాన్స్