ఆ టీడీపీ క‌మ్మ ఎమ్మెల్యేపై జ‌గ‌న్ టార్గెట్‌…

ఏపీలో వైఎస్సార్సీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చాప‌కింద నీరులా జ‌రుగుతోంది.ఇప్ప‌టికే న‌లుగురు ఎమ్మెల్యేలు సైకిల్ దిగేశారు.

ఈ లిస్టులో మ‌రో ఐదారుగురు ఎమ్మెల్యేలు ఉన్న మాట వాస్త‌వం.ఇక టీడీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో మొత్తం 11 మంది క‌మ్మ ఎమ్మెల్యేలు ( చంద్ర‌బాబు, బాల‌య్య‌తో క‌లిపి) గెలిచారు.

వీరిలో ఇప్ప‌టికే వంశీ, క‌ర‌ణం బ‌ల‌రాం పార్టీ మారిపోయారు.ఇక మిగిలిన క‌మ్మ ఎమ్మెల్యేల‌పై కూడా వైసీపీ నుంచి తీవ్ర‌మైన ఒత్తిళ్లు ఉన్నాయి.

వీరిలో కొంద‌రు ఊగిస‌లాట‌లో ఉన్నారు.వీరిలో ప‌య్యావుల కేశ‌వ్‌ను న‌మ్మే ప‌రిస్థితి లేదంటున్నారు.

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌విది కూడా అదే దారి.ఇక విశాఖ‌ను టార్గెట్‌గా పెట్టుకున్న వైసీపీ ఇప్ప‌టికే వాసుప‌ల్లి గ‌ణేష్‌ను సైకిల్ దించేసింది.

గంటా కూడా పార్టీ మారేందుకు ముహూర్తం పెట్టుకున్నారనే అంటున్నారు.ప‌శ్చిమ ఎమ్మెల్యే గ‌ణ‌బాబు కూడా అదే బాట‌లో ఉన్నారు.

ఇక టీడీపీకి తూర్పు ఎమ్మెల్యే ఒక్క‌రు మాత్ర‌మే న‌మ్మ‌కంగా ఉన్నారు.ఆయ‌న స్వ‌త‌హాగా ఎన్టీఆర్‌, టీడీపీకి వీరాభిమాని.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న్ను కూడా టీడీపీకి దూరం చేస్తే విశాఖ‌లో టీడీపీకి ఎమ్మెల్యే లేకుండా పోతార‌ని వైసీపీ భావిస్తోంది.

ఇప్ప‌టికే వెల‌గ‌పూడిని పార్టీలో చేర్చుకునేందుకు అదే క‌మ్మ వ‌ర్గానికి చెందిన మంత్రి కొడాలి నానిని ఆయ‌న‌పై ప్ర‌యోగిస్తున్నార‌ట‌.

వెల‌గ‌పూడిది కూడా కృష్ణా జిల్లాయే.ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌పై ఉన్న కేసులు బ‌య‌ట‌కు తీయ‌డంతో పాటు ఆయ‌న‌పై నాన్ లోక‌ల్ ముద్ర వేస్తూ వైసీపీ కొత్త అస్త్రాలు ప్ర‌యోగిస్తోంది.

ఇక ఆయ‌న మ‌ద్యం వ్యాపారాల‌ను ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి చేస్తోంది.ఇక ఆయ‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు స‌పొర్ట‌ర్స్‌గా ఉన్న యాద‌వ‌, మ‌త్స్య‌కార వ‌ర్గాల‌ను కూడా ఏకం చేస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే వ‌స్తే గిస్తే వెల‌గపూడిని టీడీపీకి దూరం చేయ‌డం లేదా ఆయ‌న‌కు పూర్తిగా న‌ట్లు బిగించేలా వైసీపీ చ‌క్రం తిప్పుతోన్న ప‌రిస్థితులే ఉన్నాయి.

విజయ్ దేవరకొండ టాలెంట్ ని మొదటగా నేనే గుర్తించాను, కానీ నన్ను కాదన్నారు: ప్రభాకర్