టీడీపీ దెబ్బకు జగన్ సంచలన నిర్ణయం? మంత్రుల ప్రకటన..!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ఫుల్ మెజార్టీ ఉంది కదా అని అన్ని బిల్స్‌ను అధికార పక్షం సునాయంగా పాస్ చేయించుకుంటోంది.
అయితే జగన్ సర్కార్ దూకుడుకు తొలిసారి మండలి చెక్ పెట్టింది.ఈ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్స్‌లో రెండింటికి మండలి ఆమోదం తెలపకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
"""/"/ఇంగ్లిష్ మీడియం బిల్లుతోపాటు ఎస్సీ కమిషన్ బిల్స్ విషయంలో మండలిలో ప్రతిపక్షం మాట నెగ్గింది.
మండలిలో ఇప్పటికీ ప్రతిపక్ష టీడీపీదే మెజార్టీ.2021 వరకూ ఆ పార్టీ సభ్యులే ఎక్కువగా ఉండనున్నారు.
దీంతో అసెంబ్లీలో ఈజీగా పాసై వచ్చిన ఈ బిల్స్‌ను కౌన్సిల్‌లో అడ్డుకున్నారు.ఇవి మరోసారి బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందాల్సిన అవసరం ఏర్పడింది.
ఇంగ్లిష్ మీడియం బిల్లు విషయంలో విపక్ష సభ్యులను ఒప్పించడానికి మంత్రులు తీవ్ర ప్రయత్నాలే చేశారు.
మండలి చైర్మన్ చాంబర్‌లో రెండు పక్షాల వాళ్లు సమావేశమై చర్చించారు.ఒక దశలో మండలిని కూడా రద్దు చేస్తామని మంత్రులు హెచ్చరించినట్లు సమాచారం.
అయినా టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు.ఇంగ్లిష్ లేదా తెలుగు అన్న పదాలు చేర్చాలని మాత్రమే తాము పట్టుబడుతున్నట్లు మాజీ మంత్రి యనమల స్పష్టం చేశారు.
"""/"/చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఈ బిల్లు వీగిపోయింది.బిల్స్ పాస్ కాకపోవడం ప్రభుత్వాన్ని ఓ విధంగా అప్రతిష్టపాలు చేస్తే.
ఏకంగా మండలినే రద్దు చేస్తామన్న మంత్రులు హెచ్చరికలు కొత్త చర్చకు దారి తీశాయి.
నిజానికి ఎన్టీఆర్ హయాంలో ఇలా ఒకసారి మండలిని రద్దు చేశారు.ఆ తర్వాత వైఎస్ మళ్లీ మండలిని పునరుద్ధరించారు.
ఇప్పుడు ఆయన తనయుడే మరోసారి రద్దు ఆలోచన చేస్తుండటం విశేషం.
దసరా మూవీని మిస్ చేసుకున్న హీరో.. అసలు విషయం బయటపెట్టిన మ్యూజిక్ డైరెక్టర్!