జగన్ ఆదేశాలతోనే ఈ రచ్చ జరిగిందా ? 

ప్రతిపక్షాలు ఎప్పుడూ అధికార పార్టీని రెచ్చగొట్టి, దాని ద్వారా చోటుచేసుకున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి.

ఇప్పుడు ఏపీలోనూ అదే సీన్ కనిపిస్తోంది.అధికార పార్టీ వైసిపి ని రెచ్చగొట్టే విధంగా టిడిపి, జనసేన, బీజేపీ వంటి పార్టీలు ప్రయత్నిస్తూనే వస్తున్నాయి.

ముఖ్యంగా టిడిపి ఏదో ఒక విషయంలో వైసీపీ ని తమ ట్రాప్ లో పడేలా చేస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి సంచలన విమర్శలు చేశారు.

వ్యక్తిగత దూషణలకూ దిగడంతో వైసీపీ శ్రేణులు ఆగ్రహంతో టీడీపీ ప్రధాన కార్యాలయం పై దాడులకు దిగారు.

దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలంతా యాక్టివ్ అయ్యారు.వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రోజు ఏపీ బంద్ కూడా నిర్వహించారు.

అంతేకాదు స్వయంగా టిడిపి అదినేత చంద్రబాబు 36 గంటలపాటు దీక్షకు దిగారు.ఈ వ్యవహారం ఏపీలో రచ్చరచ్చగా మారింది.

అయితే ఎప్పుడూ లేని విధంగా టిడిపి చేసిన విమర్శలపై వైసీపీ శ్రేణులు ఇంతగా రియాక్ట్ అవ్వడం వల్ల  టిడిపి లాభపడిందా ? వైసీపీకి మేలు జరిగిందా అనే విషయాన్ని పక్కన పెడితే, ఎప్పుడూ లేని విధంగా వైసీపీ శ్రేణులు ఈ విధంగా రెచ్చిపోవడానికి కారణం ఏంటి అనే విషయంపై చర్చ జరుగుతోంది.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అదేపనిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

అయినా జగన్ మాత్రం వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. """/"/ అయితే ఈ మధ్య కాలంలో ఆ విమర్శలు శ్రుతిమించి ప్రజలలోనూ దానికి సంబంధించిన చర్చ జరుగుతూ ఉండడంతో, జగన్ సైతం ఈ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

సైలెంట్ గా ఉంటే లాభం లేదని, విమర్శకు ప్రతి విమర్శ చేయాలనే నిర్ణయానికి రావడంతోనే ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో దూకుడుగా వ్యవహరించాలని మంత్రులకు సూచించారట.

అలాగే పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు సైతం ఇదే విధంగా ప్రతిపక్షాల విషయంలో వ్యవహరించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతోనే వైసీపీ శ్రేణులు ఇంత యాక్టివ్ అయినట్లు సమాచారం.

"""/"/ ఇటీవల చంద్రబాబు నివాసం ను ముట్టడించేందుకు వైసిపి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రయత్నించడం, ఇప్పుడు టిడిపి ప్రధాన కార్యాలయం పై వైసీపీ శ్రేణులు దాడులకు దిగడం ఇవన్నీ జగన్ ఆదేశాల ప్రకారమే చోటు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై జనాలూ సానుకూలంగా చర్చ జరగడం కంటే ప్రతిపక్షాలు చేసే విమర్శలు పైన ఎక్కువ చర్చ జరుగుతూ ఉండడంతో జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

శివాజీ పాత్ర పోషిస్తూ కొడుక్కి హిందూ వ్యతిరేకి పేరు.. యాక్టర్‌ను ఏకిపారేస్తున్నారుగా..??