జగన్ ప్రమాణ స్వీకార తేదీన త్వరలో ప్రకటిస్తామంటున్న మంత్రి బొత్స..!!
TeluguStop.com
2024 ఏపీ ఎన్నికలకు( AP Elections) సంబంధించి వైసీపీ( YCP ) ఫుల్ ధీమాగా ఉంది.
కచ్చితంగా రెండోసారి అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.ఆ పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్ ఈ ఎన్నికలకు చాలా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవటం జరిగింది.
ఎన్నికలకు ఏడాది ముందు నుంచే పార్టీ ఎమ్మెల్యేలను మరియు మంత్రులను నిత్యం ప్రజలలో ఉండేలా రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు.
ఆ తర్వాత సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు.సిద్ధం, బస్సు యాత్రలు ద్వారా వైయస్ జగన్ ప్రజల మధ్యకు రావడం జరిగింది.
ఈ రెండు కార్యక్రమాలు సూపర్ సక్సెస్ కావడంతో క్యాడర్ లో మరింత ఉత్సాహం నెలకొంది.
"""/" /
మే 13వ తారీకు పోలింగ్ ముగియటంతో గెలుపు పై వైసీపీ పెద్దలు ధీమాగా ఉన్నారు.
ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలవేళ టీడీపీ ఎన్నో కుట్రలు కుతంత్రాలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.జూన్ 4న ఓట్ల లెక్కింపులో వైసీపీ విజయం ఖాయమని కాన్ఫిడెంట్ గా చెప్పారు.
విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేశారు.కన్నుల పండుగగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
రేపు లేదా ఎల్లుండి ఆ తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ.
సంస్కరణలు, అభివృద్ధి కొనసాగిస్తామని మంత్రి బొత్స తెలియజేశారు.