జగన్‎కు ఇంకా ఉన్నది ఆరు నెలలే..: పవన్ కల్యాణ్

ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు.రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని పవన్ కల్యాణ్ తెలిపారు.అదేవిధంగా బీజేపీ కూడా కలిపి వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

విడివిడిగా పోటీ చేస్తే అరాచకాన్ని ఎదుర్కోలేమన్న ఆయన కలిసి పోటీ చేయాలని పేర్కొన్నారు.

మీరు ఏం చేసినా ఇక ఆరు నెలలేనని హెచ్చరించారు.ఈ క్రమంలో యుద్ధం కావాలంటే యుద్ధమే చేస్తామన్నారు.

తనకి భద్రత అవసరం లేదన్న పవన్ జైలులో చంద్రబాబుకి భద్రత అవసరం అని పేర్కొన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు.

తెలంగాణ గవర్నర్ గా ఏపీ బీజేపీ నేత ?