పృద్వీ రాజ్ వ్యవహారం : ఏదో అలా జరిగిపోయింది అంతే

పృద్వీ రాజ్ వ్యవహారం : ఏదో అలా జరిగిపోయింది అంతే

ఏపీ సీఎం జగన్ ఎంత మొండిగా, ఎంత ధైర్యం గా ముందుకు వెళతాడు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే.

పృద్వీ రాజ్ వ్యవహారం : ఏదో అలా జరిగిపోయింది అంతే

ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్నీ సంచలనాలే సృష్టిస్తున్నాడు.పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ కు అత్యంత ఆప్తులకు మంత్రి పదవులు దక్కుతాయని అంతా అంచనా వేసినా జగన్ మాత్రం ఎవరి ఊహకు అందని రీతిలో, ఎవరూ ఊహించని వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు.

పృద్వీ రాజ్ వ్యవహారం : ఏదో అలా జరిగిపోయింది అంతే

ఇక అప్పటి నుంచి ప్రతి నిర్ణయం సంచలనం సృష్టిస్తూనే ఉంది.తప్పు చేస్తే వారు ప్రతిపక్షమైనా, అధికార పక్షమైన తేడా లేకుండా జగన్ తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీ నేతల నుంచి కూడా ప్రశంసలు తీసుకొస్తోంది.

తాజాగా యస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ విషయంలోనూ జగన్ తీసుకున్న నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది .

"""/"/తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది పృథ్వీ రాజ్ ఆడియో టేపులు వ్యవహారంలో జగన్ చాలా వేగంగా స్పందించడమే కాకుండా, దీనిపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేసేందుకు అవకాశం లేకుండా చేశారు.

ఈ వివాదం వెలుగుచూసిన ఒక్క రోజులో అంతా సద్దుమణిగేలా జగన్ స్పందించిన తీరు పై ఆ పార్టీ నాయకులే కాకుండా ప్రతిపక్ష నాయకులు కూడా అభినందిస్తున్నారు.

ఓ మహిళా ఉద్యోగినితో పృథ్వీరాజ్ అసభ్యంగా మాట్లాడారు అంటూ వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో టేప్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

ఇందులో ఉన్న గొంతు పృథ్వి దా కాదా అనే విషయం ప్రస్తుతానికి పక్కన పెడితే, ఈ విషయంలో వచ్చిన విమర్శలపై జగన్ సీరియస్ గా, వేగంగా స్పందించారు.

"""/"/జగన్ ఆదేశాలతోనే పృథ్వి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం పెట్టడం, తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవడం ఇవన్నీ జరిగిపోయాయి.

ప్రస్తుతం పృథ్వీరాజ్ వ్యవహారంపై టిటిడి విజిలెన్స్ అధికారులు కూడా విచారణకు సిద్ధమవుతున్నారు.ఆడియో టేప్ లు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి గొంతు ఎవరిదీ అనే విషయాన్ని బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

దీనిపై రిపోర్ట్ ఏ విధంగా వచ్చినా ప్రస్తుతానికైతే పృద్వి రాజీనామా చేసి వెళ్లిపోయారు.

ఆడియో టేబుల్ లో ఉన్న వాయిస్ తనది కాదు కాదంటూనే పార్టీ పై గౌరవంతో రాజీనామా చేస్తున్నా అంటూ పృథ్వి ప్రకటించారు.

అవినీతి ని నిర్మూలించే దిశగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఈ విషయంలో సొంత పార్టీ వారైనా లెక్క చేయను అనే సందేశం జగన్ ఇప్పుడు బహిరంగంగా ఇచ్చినట్టయింది.

రెండు స్పూన్ల బియ్యంతో సూపర్ వైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందండిలా..!