ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తున్న జగన్?

నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీపై రాజకీయ ప్రత్యర్థులు ఏ స్థాయిలో దాడి చేసినా చూసి చూడనట్టుగా వ్యవహరించిన జగన్( CM Jagan ) గత రెండు నెలల కాలంలో మాత్రం తన తాలుకూ రాజకీయం ఎలా ఉంటుందో రుచి చూపించేశారు.

ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ సాహసించనట్లుగా ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్ష నేతను అరెస్టు చేయించడం దేశ రాజకీయ చరిత్రలోనే సంచలనం గా మారింది అనే చెప్పాలి .

అలా జరిగినా కూడా ప్రజల నుంచి పెద్దగా ప్రతిస్పందన రాకుండా, శాంతిభద్రత అదుపు తప్పకుండా కాపాడటంతో తన పరిపాలన సామర్ధ్యాన్ని చూపించుకున్న జగన్, కేంద్రం నుంచి గాని మిగతా రాజకీయ పార్టీల నుంచి గాని పెద్దగా ప్రతిస్పందన రాకుండా చూసుకోవడంలో ఆయన రాజకీయ వ్యూహ నిపుణత బయటపడింది.

"""/" / అంతేకాకుండా చట్టంలోని లోసుగులను ఉపయోగించుకొని చంద్రబాబు( Chandrababu Naidu ) బయటపడకుండా ఏ న్యాయస్థానంలో కూడా తెలుగుదేశానికి ( TDP ) ఉపశమనం దొరకకుండా పూర్తిస్థాయిలో చట్టబద్ధ పరిధిలో చంద్రబాబును ఇరికించిన విధానం రాజకీయ ప్రత్యర్థులకు తానంత చండశాసనుడో జగన్ నిరూపించినట్లయ్యింది.

రోజుకు రమారమీ కోటి రూపాయల ఫీజు తీసుకునే లాయర్లు కూడా చంద్రబాబుకి రిలీఫ్ ఇప్పించలేకపోయారేంటే జగన్ స్ట్రాటెజి ఎలా ఉంటుందో అందరికీ అర్థమైంది.

ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడే గొంతు లేదంటే అతిశయోక్తి కాదు.జనసేన అధినేత( Pawan Kalyan ) దూకుడు కూడా చంద్రబాబు అరెస్ట్ తర్వాత తగినట్లుగా కనిపిస్తుంది.

"""/" / ఉమ్మడి కార్యాచరణ అంటూ ప్రకటనలకే పరిమితమయ్యారు తప్ప ఇప్పటివరకు రెండు పార్టీలు బలంగా జనంలో తిరిగే సూచనలు కూడా కనిపించడం లేదు.

దాంతో ఎన్నికలకు దగ్గరలో ఒకవైపు ప్రజా ప్రభుత్వ వ్యతిరేకతను సాధ్యమైనంత తగ్గించుకుంటూ మరిన్ని సంక్షేమ పథకాలకు రూపకల్పన చేస్తూ రాజకీయ వ్యూహంలో జగన్ చాలా ముందుకు దూసుకెళ్తున్నారు ఇదే పరిస్థితి మరో రెండు మూడు నెలలు కొనసాగితే మాత్రం మరోసారి జగన్ ఆంధ్రప్రదేశ్ గద్దెనెక్కుతారంటంలో ఎటువంటి అతిశయోక్తి కనిపించడం లేదు.

తాను సాదారణ రాజకీయ నాయకులకు ఎందుకు భిన్నమైన నాయుకుడో తనకు ఏ స్తాయిలో రాజకీయం మీద పట్టు ఉందో తన చర్యలు ఎందుకు ఊహాతీతమో జగన్ నిరూపించుకున్నారు .

ఆ పనులు చేసి 23 కిలోల బరువు తగ్గానన్న ప్రముఖ నటి.. అప్పటినుంచే ఆఫర్లు అంటూ?