వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్ ? పక్కనపెట్టేస్తా అంటూ...?

వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ లో అసహనం రోజురోజుకు పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.

2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు జగన్ చాలా సీరియస్ గానే వర్క్ చేస్తుండగా, ఆ స్థాయిలో ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పనిచేయడం లేదనే ఆగ్రహం జగన్ ను స్పష్టంగా కనిపిస్తోంది.

ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న,  ప్రజల ఖాతాలోకి నేరుగా సంక్షేమ పథకాల సొమ్ములు వేస్తున్న, ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది అనే విషయాన్ని జగన్ గుర్తించారు.

ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది అనే విషయాన్ని గుర్తించిన జగన్ నేరుగా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వాటిని పరిష్కరించేందుకు వీలుగా గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వినూత్న కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు.

  అయితే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మొదట్లో చురుగ్గా అంతా పాల్గొన్న , మెజార్టీ ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండడంపై తాజాగా ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో జగన్ తీవ్ర ఆగ్రహం అసంతృప్తి వ్యక్తం చేశారట.

కేవలం 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సీరియస్ గా పనిచేస్తూ ప్రజాబలం పెంచుకున్నారని, ఓ 50 మంది ఎమ్మెల్యేల పనితీరు పరవాలేదు అనిపిస్తున్నా, మిగతా వారి పరిస్థితి ఏమాత్రం బాగాలేదని పనితీరు మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని విషయాన్ని జగన్ నిన్నటి సమావేశంలో చెప్పారు.

    """/"/     క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు పంతీరు అంతంతమాత్రంగానే ఉందని, మార్చుకునేందుకు ఆరు నెలలు మాత్రమే అవకాశం ఇస్తానని అప్పటికి పరిస్థితుల్లో మార్పు రాకపోతే ఇక ప్రత్యామ్నాయం చూసుకుంటానని జగన్ వార్నింగ్ ఇచ్చారట.

దీనిపై కొంతమంది ఎమ్మెల్యేలు స్పందించి తాము ఊర్లలోకి వెళ్తుంటే వివిధ సమస్యలపై జనాలు నిలదీస్తున్నారని, నిధులు లేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని చెప్పారట.

చాలాకాలం నుంచి నిధుల సమస్యతో ఎమ్మెల్యేలు నియోజకవర్గం పర్యటించేందుకు ఆసక్తి చూపించడం లేదు.

ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో జగన్ కు చెప్పడంతో నియోజకవర్గానికి రెండు రెండు కోట్లు విడుదల చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.

ఆ హామీ ఇచ్చి అప్పుడే మూడు నెలలు దాటుతున్నా, ఇప్పటికీ ఆ నిధులు అందకపోవడంతో ఎమ్మెల్యేలు ఇబ్బందికర పరిస్తితులను ఎదుర్కొంటున్నారు.

అయినా జగన్ అవేమి పట్టించుకోకుండా ఈ స్థాయిలో మార్నింగ్ ఇస్తుండడం పై వైసీపీ ఎమ్మెల్యేళ్లోనే అసంతృప్తి మొదలైందట.

భారీ అంచనాలతో వచ్చిన రాయన్ ప్లాప్ అయింది.. మరి ధనుష్ పరిస్థితి ఏంటి..?