దత్తపుత్రుడు అంటూ పవన్ ను జగన్ మరోసారి...?

H3 Class=subheader-styleదత్తపుత్రుడు /h3pఅంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి వైసిపి నాయకులు పదే పదే విమర్శలు చేసేవారు.

మొదట్లో ఈ విమర్శలను జనసేన పట్టించుకోనట్టు వ్యవహరించినా, దత్తపుత్రుడు అనే పదం జనాల్లోకి వెళ్లడం , టిడిపి కోసమే జనసేన పని చేస్తోంది అనే అభిప్రాయాలు జనాల్లోకి వెళుతుండటంతో ఈ వ్యాఖ్యలపై పవన్ ఓ సందర్భంలో సీరియస్ అయ్యారు.

దత్తపుత్రుడు అని పిలిస్తే సిబిఐ దత్తపుత్రుడు అని  జగన్ ను పిలవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

పైగా సందర్భం వచ్చినప్పుడల్లా దత్తపుత్రుడు అంటూ పవన్ ను విమర్శిస్తూనే ఉన్నారు.తాజాగా ఏపీ సీఎం జగన్ పవన్ ను ఉద్దేశించి దత్తపుత్రుడు అంటూ సవాల్ విసిరారు.

కౌలు రైతుల ఆత్మహత్యలు విషయంలో పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్న క్రమంలో జగన్ స్పందించారు.

ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతు ఒక్కరైనా ఉన్నారా అని పవన్ కళ్యాణ్ కు జగన్ సవాల్ విసిరారు.

కౌలు రైతులకు రైతు భరోసా కేంద్రం సి సి ఆర్ డి ఏ కార్డు ఉందని,  ఏడు లక్షల రూపాయల పరిహారం దొరుకుతుందని,  వారిలో ఒకరైన చూపించగలరా అని జగన్ సవాల్ విసిరారు.

చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న 438 కుటుంబాలను వైసీపీ ప్రభుత్వం ఆదుకుందని, చంద్రబాబు హయాంలో రైతు ఆత్మహత్యలు జరిగినా దత్తపుత్రుడు కి గుర్తు రాలేదని విమర్శించారు.

  ధాన్యం కొనుగోళ్లకు తమ ప్రభుత్వం 45 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని , ఐదేళ్లలో చంద్రబాబు 32 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.

"""/"/ ఈరోజు సత్యసాయి జిల్లాలో రైతు బీమా విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్న జగన్ ఈ విమర్శలు, సవాళ్లు చేశారు.

హామీలు ఇచ్చి మాట తప్పిన వారు రాజకీయాల్లో ఉండాలా లేదా అన్నది గుర్తించాలని కోరారు.

చంద్రబాబు కు ఏం చేస్తే మంచి జరుగుతుందని చెప్తే పరుగులు తీసే దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అని జగన్ విమర్శించారు.

కోనసీమలో క్రాఫ్ హాలిడే రైతులు ప్రకటించే దిశగా రైతులను రెచ్చగొట్టారని జగన్ విమర్శించారు.

గత టిడిపి ప్రభుత్వంలో రైతు భీమా గురించి పట్టించుకోలేదని బకాయిలు ఎగ్గొట్టారు అని,  కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల్లోనే 44.

25  లకల మంది రైతులకు 6,685 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా జగన్ వివరించారు.