నిమ్మగడ్డ విషయంలో మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్..!!

గతంలో ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న అనేక నిర్ణయాలు విషయంలో జగన్ సర్కార్ హైకోర్టు కి వెళ్ళిన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా నిమ్మగడ్డ విడుదల చేసిన యాప్ విషయంలో మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది జగన్ ప్రభుత్వం.

మేటర్ లోకి వెళ్తే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదుల స్వీకరణ కి ప్రత్యేకంగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ‘ఈ-వాచ్‌’ పేరిట యాప్ విడుదల చేయడం జరిగింది.

విజయవాడ ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ యాప్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు.రేపటి నుంచి అందుబాటులోకి రానున్నట్లు దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలపడంతో ఈ యాప్ పై ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.

అంతమాత్రమే కాకుండా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది.

భద్రతాపరమైన అనుమతులు లేకుండా "ఈ-వాచ్"‌ యాప్‌ను రహస్యంగా తయారు చేశారని పిటిషన్లో ప్రభుత్వం ఆరోపించింది.

ప్రజాస్వామ్య బద్ధమైన ప్రభుత్వ వ్యవస్థలో సాంకేతికపరంగా యాప్‌లు, సాఫ్ట్‌వేర్లు ఉపయోగించాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలని తెలిపింది.

  అంత మాత్రమే కాక సెక్యూరిటీ సమస్యలు, హ్యాక్‌ అయ్యే ప్ర‌మాదం ఉందని.

అయినా కానీ పంచాయతీరాజ్ శాఖ యాప్ ఉండగా కొత్త‌గా ఈ-వాచ్‌ యాప్‌ ఎందుకని ప్రశ్నించింది.

ఈ యాప్ పనితనం బట్టి చూస్తే కొన్ని పార్టీలకు లబ్ధి చేకూరేలా ఉందని పిటిషన్లో ప్రభుత్వం తెలిపింది.

ఇదిలా ఉంటే ప్రభుత్వం వేసిన పిటిషన్ పై రేపు హైకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతామని పేర్కొంది.

"""/"/ .

దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.. కడియంకు మాజీ ఎమ్మెల్యే రాజయ్య సవాల్