ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జగన్..!!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ( YCP ) ఘోరంగా ఓడిపోయింది.కూటమి 160కి పైగా స్థానాలలో గెలవడం జరిగింది.

ఈ క్రమంలో సీఎం జగన్( CM Jagan ) తన పదవికి రాజీనామా చేశారు.

విజయవాడ రాజ్ భవన్ లోని గవర్నర్ నజీర్ ( Governor Nazir )కు రాజీనామా లేఖను పంపారు.

ఇదిలా ఉంటే కూటమి గెలవడంతో జూన్ 9వ తారీకు చంద్రబాబు అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించబోతున్నట్లు సమాచారం.జరిగిన ఎలక్షన్ లో ఊహించని విధంగా కూటమి 160కి పైగా స్థానాలలో విజయం సాధించటం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.

"""/" / అంతేకాదు నాలుగో సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు( Chandrababu ) రికార్డు సృష్టించబోతున్నారు.

రాయలసీమలో ఎప్పుడు గెలవని నియోజకవర్గాలలో తెలుగుదేశం గెలిచింది.దాదాపు 8 జిల్లాలలో వైసీపీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది.

వైసీపీ నాయకులు మరియు కేడర్ సైతం ప్రజలు ఇచ్చిన తీర్పుకు షాక్ కి గురికావడం జరిగింది.

ఓడిపోయిన అనంతరం వైయస్ జగన్ సైతం చాలా భాగోద్వేగానికి గురయ్యారు.ప్రజలకు ఎన్నో మేలులు చేసిన.

ఈ రకమైన తీర్పు రావటం అర్థం కావటం లేదు అన్నట్లు మీడియా సముఖంగా మాట్లాడారు.

ఉత్కంఠ భరితంగా జరిగిన ఏపీ ఎన్నికలలో కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కార్యకర్తలు సంభరాలు చేసుకుంటున్నారు.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?