జగన్ కంచుకోటలో సొంత పార్టీ నేతల సీక్రెట్ మీటింగ్.. దీని రిజల్ట్ ఎలా ఉండబోతోంది?

ముఖ్యమంత్రి జగన్ కంచుకోటలో చీమ చిటుక్కుమన్న ఆయనకు తెలియకుండా ఉండదు.ఎందుకంటే వైఎస్ కుటుంబానికి, సీఎం జగన్ , పార్టీకి అక్కడి ప్రజలు విదేయులు.

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కడప జిల్లాను చాలా బాగా అభివృద్ధి చేశారు.

ఒక రాజధాని ప్రాంతంలో ఎలాంటి వసతులు ఉంటాయో అవన్నీ కడప జిల్లాలో చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

అందుకే వైఎస్ మరణాంతరం ఆ జిల్లాకు వైఎస్సార్ కడప జిల్లాగా పేరు కూడా మార్చారు.

H3 Class=subheader-styleరహస్య మీటింగ్‌పై జగన్ ఏమంటారు/h3p వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అక్కడి ప్రజలు ఎలా చూసుకున్నారో ఆయన తనయుడు జగన్‌ను కూడా అలాగే చూసుకుంటారు.

పులివెందుల నియోజకవర్గంలో జగన్‌కు ఓటమి అనేది తెలియదు.ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.

తండ్రి లాగే కడప జిల్లాకు జగన్ మంచి చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.కానీ అక్కడి నేతల్లో మాత్రం జగన్ తీరుపై కొంత అసహనం ఉందట.

ఎందుకంటే బలిజ వర్గానికి చెందిన నాయకులకు జగన్ పెద్దపీట వేయడం లేదని వారు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆ వర్గానికి చెందని కొంతమంది ఆదివారం సీఎం కంచుకోటలో రహస్యంగా మీటింగ్ నిర్వహించారట.

"""/"/ పార్టీకి తాము అత్యంత విధేయులమని చెబుతూనే మరోవైపు సమావేశం జరపడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా బలిజ నాయకులకు సముచిత ప్రాధాన్యం ఇవ్వలేదని ప్రధానంగా చర్చ నడించిందని టాక్.

నగర పాలక ఎన్నికల నుంచి నామినేటెడ్ పదవుల వరకు తమ సామాజిక వర్గానికి తగిన గుర్తింపు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారట.

పార్టీని అధికారంలోకి తేవడానికి తమ వర్గం ఎంతో కృషి చేసిందని వాపోతున్నారట.అయినప్పటికీ మమ్మల్ని ఎలా పక్కన బెడతారని.

దీనిపై సీఎంతో ఒకసారి మాట్లాడాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.కాగా, దీనిపై సీఎం జగన్ ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

షుగర్ కంట్రోల్ నుంచి వెయిట్ లాస్ వరకు కొత్తిమీర‌తో ఎన్ని బెనిఫిట్సో తెలుసా?