హెరిటేజ్‌ ఫ్రెష్‌ రిటైల్‌ స్టోర్లపై తప్పుడు లెక్క చెప్పి ఇరుక్కున్న వైసీపీ

ఉల్లిపాయల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో సోమవారం ప్రారంభమైన శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరిగాయి.

తొలి రోజే ఉల్లి ధరల అంశాన్ని ప్రతిపక్ష టీడీపీ లేవనెత్తింది.భారీగా పెరిగిపోతున్న ఉల్లి ధరలపై చర్చించాల్సిందేనని పట్టుబట్టింది.

అధికార, ప్రతిపక్ష సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

కిలో ఉల్లి కోసం ఓ వ్యక్తి ప్రాణం పోయిన అంశం కూడా తెరపైకి వచ్చింది.

అయితే ఉల్లి ధరలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితోపాటు వైసీపీ నేతలు చెప్పిన విషయాలు వాళ్లను అడ్డంగా ఇరికించాయి.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.

25 కే ఇస్తున్నామని, అదే చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌లో మాత్రం కిలో 200కు అమ్ముతున్నారని సీఎం జగన్‌ ఆరోపించారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2019/12/YS-Jagan-on-TDP-Heritage-Fresh-Store-About-Onion-హెరిటేజ్‌-ఫ్రెష్‌-రిటైల్‌-స్టోర్లపై-తప్పుడు-లెక్క!--jpg"/అదే సమయంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.హెరిటేజ్‌లో కిలో ఉల్లిని రూ.

135కు అమ్ముతున్నారని అన్నారు.అటు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కిలో రూ.

180కి అమ్ముతున్నారంటూ మరో ధర చెప్పారు.ధరల సంగతి పక్కన పెడితే.

అసలు హెరిటేజ్‌ సంస్థ ఎవరిదన్న అంశంపైనే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం వైసీపీ చేసింది.

నిజానికి హెరిటేజ్‌ రీటెయిల్‌ బిజినెస్‌ను మూడేళ్ల కిందటే ఫ్యూచర్‌ గ్రూప్‌నకు అమ్మేశారు.ఇప్పుడది చంద్రబాబుకు చెందిన సంస్థ కాదు.

కనీసం ఆ విషయం కూడా తెలుసుకోకుండా సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆరోపణలు చేయడం వైసీపీని నవ్వులపాలు చేసింది.

కొరటాల-ప్రభాస్ కాంబోలో మరో మూవీ.. ఈ టైమ్‌లో ఫ్యాన్స్‌కి ఓకేనా..?