జ‌గ‌న్ దెబ్బ‌కు బాబు, బాల‌కృష్ణ‌కు షాక్ ! రంగం సిద్ధ‌మైందా ?

ఏపీలో అధికార పార్టీ, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య రాజ‌కీయ పోరు ర‌స‌వత్త‌రంగా సాగుతోంది.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి రెండోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు వైసీపీ ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు చేస్తోంది.

టీడీపీని రాజ‌కీయంగా దెబ్బ కొట్టి , టీడీపీ అధినేతను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసేందుకు సీఎం జ‌గ‌న్ ప్లాన్ ర‌చిస్తున్నట్టు స‌మాచారం.

తాజాగా జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌పై అనేక అభ్యంత‌రాలు వెల్లువెత్తిన విష‌యం విధిత‌మే.ఈ విష‌యంలో జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యాలు ఒకేసారి బాల‌కృష్ణ‌కు, బాబుకు షాక్ ఇచ్చేలా ఉన్నాయ‌ట‌.

ప్ర‌స్తుతం ఉన్న 13 జిల్లాల‌ను 26 కు పెంచుతూ ముసాయిదా నోటిఫికేష‌న్ జారీ చేసిన విష‌యం విధిత‌మే.

ఉగాదినాటికి కొత్త‌జిల్లాల పాల‌న ప‌ట్టాలెక్కించాల‌ని భావిస్తున్నార‌ట‌.అయితే జిల్లాల పేర్లు, మండ‌లాల విలీనం, రెవెన్యూ డివిజ‌న్‌, జిల్లా కేంద్రాలు.

త‌దిత‌ర వాటిపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి.టీడీపీ నేత‌లు త‌మ అభ్యంత‌రాలు ప్ర‌భుత్వానికి అంద‌జేశారు.

వీటిని జ‌గ‌న్ ప‌రిశీలించి అసెంబ్లీలో జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్న‌ట్టు తెలిసింది.టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న హిందూపూర్‌ను జిల్లా కేంద్రంగా చేయాలంటూ ఆయ‌న డిమాండ్ చేయ‌డ‌మేకాకుండా ఆందోళ‌న‌లోనూ పాల్గొన్నారు.

ఆయ‌న‌కు సానుకూలంగా స్పందించి టీడీపీ కంచుకోట అయిన హిందూపూర్‌లో వైసీపీ జెండా ఎగ‌రేయాల‌ని భావిస్తున్నార‌ట‌.

మ‌రోవైపు చంద్ర‌బాబు కంచుకోట కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని రెవెన్యూ డివిజ‌న్ చేయాల‌ని విన‌తిప్ర‌తం స‌మ‌ర్పించారు.

ఈ విష‌యంలోనూ జ‌గ‌న్ స్పందించి అక్క‌డ వైసీపీ జెండా ఎగ‌రేయాల‌ని ప్లాన్ వేస్తున్నార‌ట‌.

"""/"/ అయితే 14 ఏండ్లుగా సీఎంగా ఉన్న బాబు త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గంను రెవెన్యూ డివిజ‌న్ చేయలేక‌పోయార‌ని టీడీపీ నేత‌లే మొర‌పెట్టుకుంటున్నార‌ట‌.

వీరికి అనుకూలంగా రెవెన్యూ డివిజ‌న్ చేసి కుప్పంను వైసీపీకి కంచుకోట‌గా మ‌లుచుకునేందుకు సిద్ధం అవుతున్నార‌ని స‌మాచారం.

మ‌రోవైపు విజ‌య‌వాడ‌కు ఎన్టీఆర్ పేరు పెట్ట‌డంపై అభ్యంత‌రాలు వ‌చ్చాయి.ఇదే విష‌య‌మై టీడీపీ అభిప్రాయం కోరి విజ‌య‌వాడ‌కు ఎన్టీఆర్ పేరు కొన‌సాగించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌.

ఈవిధంగా ఎన్టీఆర్ అభిమానులను సైతం ఆక‌ట్టుకునేలా జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ట‌.మొత్తంగా ఏపీలో జ‌గ‌న్ దెబ్బ‌కు అటు బాబుకు, ఇటు బాల‌య్య‌కు షాక్ త‌ప్పేలా లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెల్చుకుంది.. అయినా రెస్టారెంట్‌లో వర్కింగ్..?