ఎడిటోరియల్ : మోదీ జగన్ ఓ రాజకీయ అవసరం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన ఏంటి అనేది ఇప్పటికే నిరూపించుకున్నారు.

దేశానికి మేలు చేసే అంశాలపై ఎక్కడా వెనక్కి తగ్గకుండా తాను అనుకున్న పని అనుకున్నట్టుగా చేసి చూపించడం, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిరంతరం ప్రణాళికలు వేస్తూ, శభాష్ అనిపించుకుంటూ ఉంటారు.

2014లో మోదీ సారథ్యంలో బిజెపి అఖండ మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇక రెండోసారి అంటే 2019 ఎన్నికల్లోనూ అదేవిధంగా అధికారంలోకి వచ్చి ఎన్నో సంస్కరణలు చేస్తూ వస్తోంది.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం కాస్త అభాసుపాలైంది అనే చెప్పుకోవాలి.

దేశవ్యాప్తంగా మోదీ నిర్ణయాలపై కాస్త వ్యతిరేకత వ్యక్తమైంది.ఇప్పుడు ఎన్డీయేలోని మిత్ర పక్షాలు సైతం బిజెపికి దూరమైన పరిస్థితి వచ్చింది.

ఇదిలా ఉంటే, మొన్నటి వరకు ఏపీలో వైసీపీ ప్రభుత్వం ను కేంద్రం పెద్దగా పట్టించుకున్నట్టుగా కనిపించలేదు.

దీంతో పాటు, ఏపీ విషయంలో వివక్ష చూపినట్లుగా వ్యవహరించిన తీరు, కేంద్రంలో ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణలతో వైసీపీ ని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఏపి కి కావాల్సిన అన్ని విషయాల్లో సహాయం అందిస్తూ, ఆ పార్టీ మద్దతు తమకు ఉండేలా మోదీ మార్క్ రాజకీయం అప్పుడే మొదలైంది.

ఏపీ లో బిజెపి నాయకులు వైసీపీ పై విమర్శలు చేస్తున్నా, కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం ఆ విషయం తమకు తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తూ, సఖ్యత గా ఉంటూ వస్తున్నారు.

"""/"/ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు కు అవసరమైన మద్దతు జగన్ ఇస్తుండడంతో, ఇప్పుడు అకస్మాత్తుగా జగన్ కు ఆ పార్టీకి ప్రాధాన్యం బీజేపీలో పెరిగింది.

కొద్ది రోజుల క్రితమే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసి జగన్ అన్ని విషయాలపై చర్చించారు.

అప్పుడే వైసిపి ఎన్డీయేలో చేరబోతోందని, పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది.అప్పుడే కేంద్ర కేబినెట్ లోకి వైసిపి చేరబోతోందని, రెండు మంత్రి పదవులు కూడా తీసుకోబోతోంది అంటూ ప్రచారం జరిగింది.

ఇప్పుడు దానికి బలం చేకూరుస్తూ, మరికొద్ది రోజుల్లోనే ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కాబోతున్నట్లు ఇప్పుడు ప్రచారం మొదలైంది.

ఈ సందర్భంగా ఏపీ కి సంబంధించి తమపై విమర్శలు రాకుండా, ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ అన్ని విషయాలపైనా, చర్చిస్తారని, ఏపీకి ప్రత్యేక హోదా తో పాటు, తాను తీసుకున్న మూడు రాజధానులు, టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై సీబీఐ విచారణ ఇలా ఎన్నో విషయాలపై స్పష్టమైన క్లారిటీ తీసుకుని, ఆ తర్వాతే ఈ ఎన్డీయేలో చేరిక విషయమై క్లారిటీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు బీజేపీకి వైసీపీపై ప్రేమ పెరిగినా, వైసీపీకి బీజేపీపై ప్రేమ పెరిగినా, ఒకరికొకరు మధ్య ఉన్న రాజకీయ అవసరాలే.

ఇది సుదీర్ఘకాలం ఉండదు.ఒకరితో మరొకరికి రాజకీయ అవసరం తీరిపోగానే మళ్లీ పొత్తు పెటాకులు అవ్వడం ఖాయం.

ఏపీలో దూకుడు పెంచుతోన్న బీజేపీ .. భారీగా  స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు