బాబు టూర్ ను జగన్ ఇలా ప్లాప్ చేశారా ? 

ఏపీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేసిన వ్యవహారాన్ని రాజకీయంగా మైలేజ్ ఇచ్చే విధంగా చేసుకోవడంతో పాటు,  బిజెపికి దగ్గరయ్యేందుకు అవకాశం గా మార్చుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు ముందుగానే నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు 36 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టి అనంతరం ఢిల్లీకి వెళ్లారు.

రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకడంతో ఏపీ ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.అంతకుముందే కేంద్ర బిజెపి పెద్దలను కలిసేందుకు వారి అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు.

  ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్ ప్రభుత్వం పై ఫిర్యాదు చేయడంతో పాటు, పొత్తు విషయాలను ప్రస్తావించాలని బాబు అభిప్రాయపడ్డారు.

  కానీ కేంద్ర బీజేపీ పెద్దలు ఎవరూ బాబు కు అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు ఇష్టపడకపోవడం తో, నిరసగానే బాబు ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చేశారు.

అయితే ఢిల్లీలో బిజెపి పెద్దలెవరు బాబుకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జగన్ చక్రం తిప్పారట.

ప్రస్తుతం బిజెపికి తెలుగు దేశం పార్టీ కంటే వైసిపి అవసరమే ఎక్కువగా ఉంది.

రాబోయే ఎన్నికల తర్వాత కూడా జగన్ తో బిజెపికి అవసరం ఏర్పడవచ్చు.  ఈ క్రమంలోనే గత కొంతకాలంగా జగన్ ప్రభుత్వానికి కేంద్రం అనేక విషయాల్లో సహకరిస్తూ వస్తుంది.

ఏపీలో బీజేపీ నాయకులు వైసీపీ పై విమర్శలు చేస్తున్నా, కేంద్ర బిజెపి పెద్దలు మాత్రం జగన్ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు.

దీనికి తోడు 2014లో టీడీపీ అధినేత చంద్రబాబు బిజెపితో పొత్తు పెట్టుకున్న సమయంలో వ్యవహరించిన తీరు,  ఆ తర్వాత పొత్తు రద్దు చేసుకుని మోదీ,  అమిత్ షా వంటి వారిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం వంటి వ్యవహారాలను ఇప్పటికీ వారెవరు మరిచిపోలేదు.

    """/" /   అలాగే 2019 ఎన్నికలకు ముందు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి బిజెపి ని ఓడించేందుకు చంద్రబాబు వ్యూహాలు రచించడం వంటి వ్యవహారాలు ఎన్నో  బిజెపి కేంద్ర పెద్దలకు ఆగ్రహాన్ని కలిగించాయి.

మళ్లీ ఇప్పుడు బాబు విషయంలో సానుకూలంగా వ్యవహరించినా, తమకే ఇబ్బంది అని అభిప్రాయం లో బిజెపి కేంద్ర పెద్దలు ఉండటం తదితర కారణాలతో టిడిపి ని దూరం పెడుతున్నట్టుగా వ్యవహరించారు.

ఇప్పుడు జగన్ జోక్యంతో ఢిల్లీలో బాబుకు నిరాశే ఎదురైంది.   .

ఉషా కిరణ్ మూవీస్ వల్ల సౌందర్య నటించిన చివరి సినిమా విడుదలకు నోచుకోలేదా ?