తొలిసారిగా జగన్ లాంగ్ లీవ్.. 10 రోజులు విదేశాల్లోనే..!!

ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతోంది.ఈ మూడేళ్ల కాలంలో ఆయన ఎన్నిసార్లు బయటకు వచ్చారంటే వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.

ఢిల్లీ టూర్, సంక్షేమ పథకాలను ప్రారంభించడానికి తప్పితే ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావడం చాలా అరుదు అనే చెప్పాలి.

కరోనా టైంలోనూ ఆయన పూర్తిగా తాడేపల్లి ఇంటికే పరిమితం అయ్యారు.ఈ విషయంపై ప్రతిపక్షాలు ఓ రేంజ్‌లో విమర్శలు కూడా చేశాయి.

టీడీపీ హయాంలో అయితే రాష్ట్రానికి పెట్టుబడుల కోసం చంద్రబాబు పదే పదే విదేశీ టూర్లకు వెళ్లేవాళ్లు.

పెట్టుబడులు వచ్చాయా లేదా అన్న సంగతి పక్కన బెడితే చంద్రబాబు మాత్రం నెలకొకసారి విదేశీ టూర్ వెళ్లి కంపెనీలకు ఏపీకి ఆహ్వానించేవాళ్లు.

జగన్ హయాంలో పరిశ్రమలు అనే మాటే లేదు.అభివృద్ధిని పక్కన పెట్టేసి పూర్తిగా సంక్షేమ పథకాలపైనే వైసీపీ ప్రభుత్వం ఆధారపడింది.

అందుకే ఏపీకి రావాల్సిన పెట్టుబడులు తెలంగాణకు లేదంటే బెంగళూరు, చెన్నైలకు తరలివెళ్లిపోయాయి.ఈ విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఎట్టకేలకు జగన్ సీఎం హోదాలో తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు.ఈనెల 22 నుంచి దావోస్‌లో ప్రారంభయ్యే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు సీఎం జగన్ వెళ్తున్నారు.

ఈ మేరకు శుక్రవారం ఉదయమే ఆయన గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో దావోస్ బయలుదేరివెళ్లారు.

ఈ సందర్భంగా జగన్ 10 రోజుల పాటు విదేశీ పర్యటనలోనే ఉంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

"""/"/ వైసీపీ హయాంలో జగన్ లేకుండా తొలిసారిగా 10 రోజుల పాటు ఏపీలో పాలన సాగబోతుంది.

సీఎం అయిన తర్వాత జగన్ లాంగ్ లీవ్‌లో ఉండటం కూడా ఇదే తొలిసారి.

గతంలో కుటుంబసమేతంగా జెరూసలెం వెళ్లిన ఆయన వారం రోజుల్లోనే తిరిగి వచ్చారు.జగన్ లాంగ్ లీవ్‌లో ఉన్నా కీలక బాధ్యతలను ఆయనే ఆపరేట్ చేయనున్నారు.

ఇతరులకు బాధ్యతలు అప్పచెప్పడం ఆయనకు ఇష్టం లేదు.గతంలో జెరూసలెం పర్యటన సమయంలోనూ జగన్ అన్నీ చూసుకున్నారు.

ఇప్పుడు కూడా విదేశాల నుంచే ఏపీ వ్యవహారాలను జగన్ చూసుకుంటారని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

 .

పోలీస్‌స్టేషన్‌లో అల్లు అర్జున్‌పై కంప్లైంట్.. ఎందుకంటే?