మేము అది చేస్తుంటే మీరు ఇది చేస్తారా ?

వైసీపీ ప్రభుత్వం పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ నిరంతరం ప్రజల కోసమే పాటుపడుతూ ఉంటే అభినందించాల్సిందే పోయి తమ ప్రభుత్వం పై నిరంతరం విమర్శలు చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు.

పెద్ద పెద్ద వాళ్ళు పిల్లలంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుం,టూ ఉంటే పేద ప్రజల పిల్లలు మాత్రం తెలుగు మీడియం లోనే చదవాలంటూ జగన్ ప్రశ్నించారు.

తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాదయాత్ర సమయంలో మీకు నేను ఇచ్చిన హామీలు అమలు చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ మత్స్యకారులను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు.

మీకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.గత టిడిపి ప్రభుత్వం మత్స్యకారులు సంక్షేమం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోలేదని, అందుకే మత్స్యకారులు తమ హక్కుల కోసం ఉద్యమాలు చేశారని, అయితే వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల బాధలను అర్థం చేసుకుని మత్స్యకార భరోసా అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఈ పథకం కింద ప్రమాదవశాత్తు ఎవరైనా మత్స్యకారుడు చనిపోతే తక్షణం నష్టపరిహారం కింద 10 లక్షలు అందిస్తామని జగన్ ప్రకటించారు.

అలాగే వేట నిషేధ కాలంలో పదివేలు చొప్పున అందిస్తామన్నారు.ఇక మత్స్యకారులకు ఇచ్చే డీజిల్ సబ్సిడీని తొమ్మిది రూపాయలకి పెంచుతున్నామని, ఈ పథకం కింద మొత్తం 35 వేల మత్స్యకార కుటుంబాలు లబ్ధి పొందుతాయని జగన్ ప్రకటించారు.

నాలుగేళ్లలోనే పోలీస్ అవతారం ఎత్తాడు.. కేసులు సాల్వ్ చేశాడు..?