షర్మిల ఓడిపోతుందని బాధపడుతున్న జగన్ 

గత కొంతకాలంగా వైఎస్ కుటుంబంలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.ముఖ్యంగా మాజీ మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

వివేకానంద రెడ్డి హత్యకు కారణం వైస్ అవినాష్ రెడ్డి అంటూ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతతో పాటు, వైఎస్ షర్మిల( YS Sharmila ) కూడా ఆరోపణలు చేయడం వంటివి సంచలనమే రేపాయి.

వైస్ జగన్ తో విభేదించిన షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించి కొద్దికాలంలోనే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తెలంగాణ రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికారు.

ఏపీ కాంగ్రెస్ లో యాక్టివ్ అవ్వడమే కాకుండా, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగాను బాధ్యతలు స్వీకరించారు.

"""/" / ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో, వైస్ జగన్ టార్గెట్ గా షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ఇక వైసిపి కూడా అంతే స్థాయిలో ప్రతి విమర్శలు చేస్తోంది.వైస్ అవినాష్ రెడ్డి( YS Avinash Reddy ) కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉండడంతో, షర్మిల కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.

వైస్ వివేకా</emను చంపిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న అవినాష్ ను ఓడించాలని, అవినాష్ కు మద్దతుగా నిలుస్తున్న జగన్ కు బుద్ధి చెప్పాలని షర్మిల పదేపదే విమర్శలు చేస్తున్నారు.

ఈ విమర్శలపైనా, షర్మిల తీరు పైన మొదటిసారిగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ నేషనల్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఇండియా టుడే తరఫున జగన్ ను ఇంటర్వ్యూ చేశారు.

ఈ సందర్భంగా షర్మిల అంశాన్ని ప్రస్తావించారు.దీనిపై స్పందించిన జగన్ తనకున్న సమాచారం ప్రకారం షర్మిలకు డిపాజిట్ కూడా రాదని, ఈ విషయం తనకు ఎంతో బాధ కలిగించే విషయం అని, ఆమె పోటీ చేస్తోంది అలాంటి పార్టీ నుంచి అంటూ జగన్ వ్యాఖ్యానించారు.

"""/" / అంతేకాదు కాంగ్రెస్ అంటే వైస్ రాజశేఖర్ రెడ్డి పేరు చార్జిషీట్ లో చేర్చిన పార్టీ అని, అలాగే తనమీద తప్పుడు కేసులు పెట్టించిందని జగన్ మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండి నడిపిస్తున్నది చంద్రబాబు అని, చంద్రబాబు ఆయన శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కలిసి షర్మిలను తప్పుదోవ పట్టించారని, తన మీదకు యుద్ధానికి పంపాలని జగన్ మండిపడ్డారు.

అఖండ సీక్వెల్ లో ఆ ఒక్క సీన్ కు పూనకాలు పక్కా.. థమన్ హామీ ఇచ్చేశారుగా!