జిల్లాల వారి సర్వేలతో నాయకులను హడలెత్తిస్తున్న జగన్!
TeluguStop.com
వైసీపీ( YCP ) ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందని, ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలలో ప్రజా ఆగ్రహం ప్రతిఫలించిందని , ఇప్పటికైనా సరయిన దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న వేల వైసిపి అధిష్టానం చర్యలకు ఉపక్రమించినట్టుగా వార్తలు వస్తున్నాయి .
జిల్లాలు వారీగా యూనిట్లను కేటాయించుకున్న జగన్ టీం ఐపాక్ క్షేత్రస్థాయిలో వాస్తవాలను సర్వే రూపంలో జగన్కు ఇప్పటికే నివేదించిందని ఆ సర్వేల ఆధారంగా జగన్ ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేస్తున్నారని, సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొంతమందికి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి.
"""/" / గడపగడపకు కార్యక్రమం( Gadapa Gadapaku Mana Prabhutvam )లో ఎమ్మెల్యేలు ఏ మేరకు నిజాయితీగా పాల్గొన్నారు, ఎన్ని ఇళ్లకు తిరిగారు పార్టీపై ప్రజల అభిప్రాయం ఏమిటి ? వ్యతిరేకత పార్టీ మీద ఉందా లేదా లోకల్ ఎమ్మెల్యే మీద ఉందా? ఇలా అన్ని విషయాలను కూలంకషం గా సర్వేల రూపంలో తెలుసుకున్న జగన్( YS Jagan Mohan Reddy ) , గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేల మీద నిర్ధాక్షిణ్యంగా వేటు వేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.
"""/" / ఇన్ని సంక్షేమ పథకాలు( Welfare Schemes ) ఎంత కష్ట సాధ్యమైనప్పటికీ రాజీపడకుండా అమలు చేస్తున్న తమ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల విమర్శలు ఏ మేరకు నిజమో కూడా వలంటీర్ల దగ్గరనుండి పూర్తిస్థాయి నిజానిజాలను , నియోజకవర్గాల వారీగా సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారని, ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి పాటించాల్సిన వ్యూహాలకు కూడా ప్రణాళికలు రచిస్తున్నారని ఎంత బలమైన నేత అయినప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని సంకేతాలను ఎప్పటికీ ఇచ్చారని తెలుస్తుంది.
"""/" / ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకొని పార్టీని బలపరిచే ప్రణాళికలు రచిస్తున్నందుకు పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉండగా ఆ సర్వే రిపోర్ట్ లో తమ పనితీరుపై ఎలాంటి పలితం వస్తుందో అంటూ ఆయా నియోజకవర్గ నేతలు టెన్షన్ పడుతున్నట్లుగా సమాచారం.
మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎంతమంది తమ సీటును నిలుపుకుంటారో ఎంత మందికి షాక్ తగులుతుందో మరికొద్ది రోజుల్లో ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది .
నాని నిర్మాణంలో మెగాస్టార్ చిరు…డైరెక్టర్ ఎవరో తెలుసా?