జగన్ మాట చెల్లుబాటు కాదా ? ప్లేస్ మార్చనున్నారా ? 

ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఏపీ సీఎం జగన్ ఎక్కడ వరకైనా వెళ్తారు.ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటూనే వస్తున్నారు.

అలాగే టిడిపి ప్రభుత్వంలో తాము వ్యతిరేకించిన వాటిని టిడిపి పట్టించుకోకపోగా, వాటిని అమలు చేసి చూపించి వైసీపీ ని ఇరుకున పెట్టింది.

అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి విషయాలపై దృష్టి పెట్టారు.దీనిలో భాగంగానే ఏపీ రాజధాని  విషయంలో జగన్ కీలక ప్రకటన చేశారు.

మొదటి నుంచి తాము అమరావతిని రాజధానిగా వ్యతిరేకించినా టిడిపి వినిపించుకోలేదని, అక్కడ రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల మిగిలిన ప్రాంతాలు వెనుకబాటుకు గురవుతాయనే కొత్త వాదనను తీసుకొచ్చిన జగన్ , మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు అంతేకాకుండా విశాఖ,  కర్నూలు ,అమరావతి ఈ మూడు ప్రాంతాల్లో రాజధాని ఉండడం వల్ల ఉత్తరాంధ్రర, కోస్తా, రాయలసీమ జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని జగన్ గట్టిగా వాదించారు.

ఈ మేరకు రాజధాని ఏర్పాటుకు చురుగ్గా ప్రయత్నిస్తున్న సమయంలోనే ఈ వ్యవహారం కోర్టు కు వెళ్ళింది.

అయితే అప్పటి నుంచి దీనిపై వాయిదాలు పడుతూ వస్తోంది.మే మూడో తేదీ నుంచి ప్రతిరోజు రాజధాని పై వాదనలు జరుగుతాయని కోర్టు ప్రకటించిన నేపథ్యంలో కరోనాా కారణంగా  వరుసగా వాయిదాలు పడుతూనే వస్తున్నాయి.

దీంతో రాబోయే ఎన్నికల నాటికి అయినాా, తాను ప్రకటించిన మూడు రాజధానుల  ప్రకటన నిజం అవుతుందా లేదా అనే ఆందోళన  కనిపిస్తోంది.

"""/"/ అయితే కోర్టు వ్యవహారం ఇప్పట్లో ఆగేది కాదు కనుక , తాను ఎక్కడ ఉంటే అక్కడ నుంచే పరిపాలన సాగుతుంది కాబట్టి , త్వరలోనే తాడేపల్లి నుంచి విశాఖకు మకాం మార్చాలని జగన్ చూస్తున్నారట.

అప్పుడు అధికారికంగా కాకపోయినా అనధికారికంగా అయిన విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని,  ఆ విధంగా అయినా తాను ఇచ్చిన మాట కొంతవరకు అయినా  నెరవేరునట్లు అవుతుందనే అభిప్రాయంలో జగన్ ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

ఆ 3500 రూపాయలు నేనే అడిగాను.. వైరల్ అవుతున్న రేణూ దేశాయ్ కామెంట్స్!