పవన్ పై డోసు పెంచిన జగన్! పథకం ప్రకారమేనా ?

ఉన్నట్టుండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్( YS Jagan ).

శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కింద 200 పడకల స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర వాఖ్యలు చేశారు .

తెలంగాణలో పుట్టలేనందుకు చాలా బాధపడుతూ మాట్లాడే ఓ నాన్ లోకల్ స్టార్ కనీసం అక్కడ చెల్లెలు బర్రెలక్క వచ్చిన ఓట్ల శాతం కూడా తెచ్చుకోలేకపోయారని , నోటతో పోటీ పడ్డారని ఎద్దేవా చేశారు.

పనిలో పనిగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. """/" / తనను దశాబ్దాలుగా గెలిపిస్తున్న కుప్పానికి ఏమి చెయ్యని పెద్దమనిషికి ఉత్తరాంధ్ర పై ప్రేమ ఎలా ఉంటుందని? కేవలం ఎన్నికల గిమ్మక్కుల కోసం ప్యాకేజి స్టార్ ని అడ్డుపెట్టుకొని డ్రామాలు చెయ్యడం మాత్రమే చంద్రబాబుకు వచ్చు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

రాబోయే కాలంలో వీళ్ళ అబద్దాలు శృతిమించుతాయని, అబద్ధపు హామీలు ఇచ్చింది ఎవరు? ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది ఎవరు అంటూ ప్రజలు ఆలోచించాలంటూ ఆయన చెప్పుకొచ్చారు.

పవన్ ను తరచూ ప్యాకేజ్ స్టార్ అని దత్తపుత్రుడు అని విమర్శించే జగన్ ఇక్కడ మ్యారేజ్ స్టార్ అంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

"""/" / అయితే ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతుందని, జనసేన( Janasena ) తెలుగుదేశం పొత్తు కీలక దశలోకి చేరుకున్నందున ఈ సమయంలో పవన్ పై ఒత్తిడి పెంచి పొత్తును విఫలం చేసేందుకు ప్రయత్నం చేయాలన్నట్లుగా వైసీపీ పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది .

ముఖ్యంగా తక్కువ సీట్లకు జనసేన సర్దుకుపోతే పవన్ కు మద్దతు ఇస్తున్నకు సామాజిక వర్గ యువతను రెచ్చగొట్టడమే ధ్యేయంగా అధికార పార్టీ పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది.

దాంతోనే పవన్ ప్యాకేజీ కి అమ్ముడు పోయి సీట్లను అమ్మేసుకుంటున్నారంటూ ప్రచారం మొదలుపెట్టారు.

రెండు పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించే వరకు పవన్ పై ఒత్తిడి పెంచితే పొత్తు పెటాకులు అయ్యే అవకాశం ఉందని వైసిపి అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది లేదా కనీసం పవన్ కు మద్దతిస్తున్న కొన్ని వర్గాల మద్దతునైనా దూరం చేయవచ్చు అన్నది వైసిపి వ్యూహకర్తల ఆలోచనగా తెలుస్తుంది.

అధ్యక్ష ఎన్నికల వేళ కలకలం.. కోవిడ్ బారినపడ్డ జో బైడెన్ , అర్ధాంతరంగా సభ నుంచి ఇంటికి