విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే.

ధనవంతుల పిల్లల మాదిరిగా పేదవాళ్ల పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివే రీతిలో కొత్త విద్యా వ్యవస్థను తీసుకురావడంతో పాటు స్కూల్ రూపురేఖలు కూడా మార్చేయడం జరిగింది.

మధ్యాహ్నం భోజనం ద్వారా పోషకాహారం లభించే రీతిలో.ప్రత్యేకమైన మెనూ తయారు చేయడం జరిగింది.

స్కూల్ యూనిఫామ్ మరియు పాఠ్యపుస్తకాలు కూడా అందిస్తున్నారు.త్వరలో ట్యాబ్ లు హై స్కూల్ విద్యార్థులకు అందించనున్నారు.

"""/" /   ఇదిలా ఉంటే ఇప్పుడు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది.

విదేశాలలో ఉన్నత విద్యాసాగుతున్న విద్యార్థులకు "జగనన్న విదేశీ విద్యా దీవెన" పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది.

QS ర్యాంకింగ్స్ లో ఉన్న వర్సిటీలో సీటు వస్తే పూర్తి ఖర్చును, మిగతా యూనివర్సిటీలో సీటు వస్తే 50 లక్షల వరకు ఫీజును ప్రభుత్వం భరించనుంది.

నాలుగు వాయిదాలలో నేరుగా డబ్బులు చెల్లించనుంది.

నాని ‘సరిపోదా శనివారం’ సినిమాతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడా..?