రికార్డు క్రియేట్ చేసిన జగన్ ప్రభుత్వం..!!

మొదటినుండి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఈ విషయంలో జగన్ ప్రభుత్వం చాలా చురుకుగా ఉన్న సంగతి తెలిసిందే.

కేంద్రం సరిపడా డోస్ లు అందిస్తే రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా అందరికీ కరోనా టీకా వేసే సత్తా రాష్ట్రంలో ఉందని వైసీపీ ప్రజా ప్రతినిధులు తెలిపారు.

ఇదే క్రమంలో ఎప్పటికప్పుడు కరోనా వ్యాక్సిన్ లు రావడంతోనే చాలా వరకు టీకాలు వేయడం జరిగింది.

ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది.

మొత్తం రాష్ట్రంలో ఆరు కోట్ల మంది ఉండగా సగం మందికి వ్యాక్సిన్ వేసిన రాష్ట్రంగా జగన్ ప్రభుత్వం రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది.

అతి తక్కువ టైమ్ లోనే దాదాపు మూడు కోట్ల మందికి టీకా వేయటానికి గల కారణం రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థతోపాటు సచివాలయ వ్యవస్థ అని అంటున్నారు.

"""/" / దేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో పోలిస్తే వ్యాక్సినేషన్ డ్రైవ్ విషయంలో ఏపీ టాప్ లో నిలిచింది.

ఎందుకు కారణం వ్యాక్సిన్ సెంటర్లు రాష్ట్రవ్యాప్తంగా 2500 కేంద్రాలు.స్పెషల్ డ్రైవ్ గా ఏర్పాటు చేయడమే అని అంటున్నారు.

సరిగ్గా సిబ్బందిని ఉపయోగించుకుని.వ్యాక్సినేషన్ సెంటర్లకు నిర్ణీత సమయంలో జనాలు వచ్చేలా.

ముందుగా సమాచారం ఇవ్వటం తోనే ఏపీలో సగం మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది అని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు.

ఏదిఏమైనా అతి తక్కువ సమయంలో ఏపీలో సగానికి సగం మంది కి వ్యాక్సిన్ వేయడంతో థర్డ్ వేవ్ విషయంలో కొద్దిగా ఊపిరి పీల్చుకోవచ్చని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా..: జగ్గారెడ్డి