బోస్టన్ నివేదిక వచ్చేసిందా ? అందులో ఇలా ఉందా ?
TeluguStop.com
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి రాజధానిలో ఏర్పాటుపై బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వానికి అందినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు జగన్ తో సమావేశమైన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ తమ నివేదికను అందించినట్టు సమాచారం.
ఈనెల ఆరో తేదీన జీఎన్ రావు, బోస్టన్ గ్రూప్ నివేదికలను హై పవర్ కమిటీ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోబోతోంది.
ఈనెల ఆరో తేదీన దీనికి సంబంధించిన మీటింగ్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అధ్యక్షతన ఏర్పాటు కాబోతోంది.
ఈ కమిటీ మూడు వారాల్లో తమ నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది.బోస్టన్ గ్రూప్ తమ నివేదికలో అభివృద్ధి వికేంద్రీకరణకు , మూడు రాజధానుల ఏర్పాటుకు అనుకూలంగా తమ నివేదికను ఇచ్చినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
పాలనా పరంగా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేందుకు ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో హై పవర్ కమిటీ నివేదిక ఏ విధంగా ఉంటుంది అనేది తేలాల్సి ఉంది.
దానికంటే ముందుగా బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక పూర్తి స్థాయిలో బయటకి వస్తే కానీ పూర్తి విషయాలు తెలిసే అవకాశం కనిపించడంలేదు.
తెలుగు డిజాస్టర్ సినిమాలతో వందల కోట్లు సంపాదిస్తున్న నిర్మాత.. ఏం జరిగిందంటే?