చిరు జగన్ భేటీ : ఆ లెక్కన జగన్ లాభపడినట్టేనా ?

అసలు విషయం ఏంటో తెలియక పోయినా ఒక్కోసారి కొన్ని కొన్ని సంఘటనలు హాట్ టాఫిక్ గా మారిపోతాయి.

ఇక సెలెబ్రెటీల విషయానికి వస్తే ఆ హడావుడి మరి కాస్త ఎక్కువగా ఉంటుంది.

ఇప్పుడు అదే తరహా టాపిక్ ఏపీ సీఎం జగన్, మెగా స్టార్ చిరంజీవి విషయంలో చోటు చేసుకుంది.

వారిద్దరూ ఇప్పటి వరకు భిన్న దృవాలుగా ఉన్నారు. """/"/  అందులోనూ చిరు తమ్ముడు పవన్ జనసేన పార్టీ ని పెట్టి ఎన్నికల్లో పోటీకి వెళ్ళాడు.

అక్కడ చేదు ఫలితం ఎదురయినా వచ్చే ఎన్నికల్లో తన ప్రతాపం చూపిస్తాను అన్నట్టుగా అధికార పార్టీ మీద హడావుడి చేస్తున్నాడు.

సరిగ్గా ఇదే సమయంలో జగన్‌ను చిరంజీవి కలవడం దాదాపు గంటసేపు భేటీ అవ్వడం జరిగిపోయాయి.

ఇంతకీ ఆ భేటీ ఎందుకు జరిగింది ? ఏమి జరిగింది అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేకపోయినా, ఈ భేటీ వైసీపీకి భారీగా మైలేజ్ తీసుకొచ్చిందని చెప్పాలి.

ముఖ్యంగా జగన్ ఈ విషయం లో వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడకు పదును పెట్టినట్టు స్పష్టంగా అర్ధం అవుతోంది.

"""/"/  చిరంజీవితో జరిగిన భేటీలో ఆయన తనకు ఆత్మీయుడిలా చిరు అభిమానులకు జగన్ సంకేతాలు పంపారు.

అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టే వ్యూహాలకు కూడా పదును పెట్టినట్లు తెలుస్తోంది.

చిరు తమ్ముడే పవన్ కావడం, మరోవైపు చిరంజీవి సామాజిక వర్గమైన కాపులను దగ్గరకు చేసుకున్నట్లు సంకేతాలు పంపారు.

కాకపోతే ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక్క తానులో ముక్కలేనని వైసీపీ నేతలు గట్టిగా ప్రచారం చేసి జనాల్లోకి బాగా తీసుకెళ్లగలిగారు.

అంతేకాదు ఎన్నికల తర్వాత కూడా టీడీపీ కనుసన్నులోనే జనసేన ఉందంటూ ప్రచారం మొదలుపెట్టారు.

కానీ ఇప్పుడు చిరంజీవితో మీటింగ్‌ ద్వారా జగన్ పవన్ కి ఒకరకమైన సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

చిరుకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, అటు పవన్ కు చెక్ పెట్టడమే కాకుండా కోస్తాంధ్రాలో బలమైన కాపు సామాజిక వర్గానికి కూడా దగ్గరయ్యే వ్యూహానికి జగన్ పదును పెట్టుకోగలిగారు.

"""/"/  ప్రస్తుతం నెలొకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అవసరమైతే చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చి కాపుల మద్దతు కూడగట్టడంతో పాటు పవన్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేందుకు కూడా జగన్ స్కెచ్ వేస్తున్నట్టు కనిపిస్తోంది.

అంతేకాదు చిరంజీవి జగన్ బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ మీటింగ్ ద్వారా సిగ్నల్స్ ఇవ్వడం, తాము రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నామని చెప్పడం ద్వారా జనసేన క్యాడర్ లో కొద్దిమందయినా వైసీపీకి మద్దతుగా నిలబడే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

చిరు నిజంగా 'సైరా' సినిమా చూడాల్సిందిగా జగన్ ను కోరేందుకే భేటీ అయినా ఇందులో ఎక్కువ లాభపడింది మాత్రం జగన్ అనే విషయం స్పష్టమవుతోంది.