కేసీఆర్ ను ఫాలో అయిపోతున్న జగన్ ! ఆ యాగం అందుకేనా ?
TeluguStop.com
తెలంగాణ సీఎం కేసీఆర్ సక్సెస్ ఫుల్ రాజకీయ నాయకుడిగా వెలుగొందుతున్నాడు.కేసీఆర్ రాజకీయ వ్యూహాలు, ఆలోచనలు చాలామంది రాజకీయ నాయకులను ఆకర్షిస్తున్నాయి.
అందుకే చాలామంది ఆయన బాటలో నడుస్తూ విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆ విధంగానే వైసీపీ అధినేత జగన్ కూడా ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ఎన్నికల్లో అనుసరించిన విధానాన్నే తాను కూడానా అనుసరించాలని డిసైడ్ అయిపోయాడు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ గెలుపు కోసం కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించాడు.
ఆ తరువాతనే మలివిడత ప్రచారం నిర్వహించాడు.యాగం ప్రభావమో ఇంకొకటో తెలియదు కానీ టీఆర్ఎస్ తెలంగాణాలో తిరుగులేని విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇదంతా యాగం ఫలితమే అని కేసీఆర్ తో సహా చాలామంది భావించారు.తాజాగా కేసీఆర్ బాటలో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కూడా సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
ముందుగా కేసీఆర్ నిర్వహించిన యాగాన్ని జగన్ కూడా నిర్వహించినట్టు ప్రచారం ఊపందుకుంది దీనికి సంబంధించి బెంగళూరు మిర్రర్ అనే పత్రికలో కధనం కూడా ప్రచురితం అవ్వడం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
జగన్ తరపున స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఈ యాగాన్ని నిర్వహించారని ప్రచారం జరుగుతోంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
నెల్లూరులో జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఓ ఎంపీ ఈ మొత్తం యాగం కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారని ప్రచారం సాగుతోంది.
కాకపోతే ఈ కార్యక్రమానికి జగన్ దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.ఏపీలో ఎట్టిపరిస్థితుల్లో అయినా అధికారం దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్న జగన్, గెలుపు కోసం ఏమి చేయడానికైనా సిద్దమే అన్నట్టుగా పట్టుదలగా ఉన్నాడు.
అందుకే గెలుపు దారుల కోసం అన్నిరకాలుగా ప్రచారం సాగిస్తున్నాడు.ఇప్పుడు ఈ యాగం చేయడం వెనుక కారణం కూడా అదే అని తెలుస్తోంది.
ఇదంతా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాలు, సూచనల మేరకే జరిగినట్టు తెలుస్తోంది.