ఆ భారమంతా మంత్రులదేనా ? తేడా వస్తే ఇంటికేనా ?

పేరుకే తాము మంత్రులం తప్ప తాము స్వేచ్ఛగా ఆ మంత్రి పదవులు అనుభవించడానికి లేకుండా పోయింది అంటూ లోలోపల బాధపడుతున్నఏపీ మంత్రులకు జగన్ ఇప్పుడు మరో అగ్ని పరీక్ష పెట్టాడు.

ఆ పరీక్ష లో నగ్గితేనే వారి మంత్రి పదవి సేఫ్ గా ఉంటుంది.

లేకపోతే ఇంటికి పంపేందుకు కూడా వెనకాడబోమని జగన్ పదేపదే హెచ్చరికలు చేస్తుండడంతో మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

జగన్ ఫోటో తప్ప మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడా అవసరం లేకుండా జగన్ నేరుగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తున్నాడు.

దీంట్లో ఎవరూ జోక్యం చేసుకునేందుకు వీల్లేకుండా జగన్ కట్టడి చేసాడు.దీంతో తాము డమ్మీలుగా మారామనే బాధ వారిలో ఎక్కువగా కనిపిస్తోంది.

ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుండడం మంత్రులను కలవరపెడుతోంది.

"""/"/ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు వైసీపీకి ఆయా జిల్లాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ మెజార్టీ తీసుకురావాల్సిన బరువు బాధ్యత అంతా జగన్ మంత్రుల మీద పెట్టేసాడు.

ఏపీలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ముందుగా జరుగుతాయి.ఆ తరువాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని జగన్ చుస్తునందు.

అయితే ఏపీలో మొత్తం జిల్లా పరిషత్ లు అన్నిటినీ గెలుచుకు తీరాలని జగన్ కంకణం కట్టుకున్నాడు.

దానికోసం బాధ్యత మొత్తం మంత్రులకు అప్పగించేసాడు.అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం మన ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనన్ని పథకాలు అమలు చేసి చిత్తశుద్ధితో ఉన్నాము కాబట్టి తప్పకుండా మనమే క్లిన్ స్వీప్ చేయాలని జగన్ మంత్రులకు గట్టిగా చెబుతున్నారట.

"""/"/జిల్లా ఇంచార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఇలా అందరూ గ్రూపు రాజకీయాలు లేకుండా కలిసికట్టుగా ముందుకు వెళ్లి మెరుగైన ఫలితాలు తీసుకురావాలని జగన్ దిశానిర్దేశం చేస్తున్నాడు.

ఎవరు బాగా పని చేస్తే వారికి ప్రాధాన్యం ఉంటుంది అనే సంకేతాలు జగన్ పంపుతున్నాడు.

గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే ఫార్ములా ఉపయోగించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిన చోట మంత్రులను బాధ్యులను చేస్తూ వారిని మంత్రి మండలి నుంచి తప్పించారు.

ఇప్పుడు కూడా అదే ఫార్ములా జగన్ ఉపయోగించేందుకు సిద్ధం అవుతుండటంతో మంత్రుల్లో ఆందోళన మొదలైంది.

సెన్సిటివ్ టాపిక్స్ ని టచ్ చేస్తున్న స్మాల్ మూవీస్.. అదే వాటి సక్సెస్ మంత్ర..?