జగన్ మళ్ళీ సీఎం అవ్వాలంటే ఆ యాగం చేయాల్సిందేనా.. అదేంటంటే?

ఏపీలో వచ్చే ఏడాది రాష్ట్ర ఎన్నికలు జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే.దీంతో ఇప్పటినుంచి ఎన్నికలకు సంబంధించిన వేడి మొదలైంది.

అధికారంలో ఉన్న పార్టీ మినహా మిగిలిన పార్టీలు ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున మొదలుపెట్టేసాయి.

వచ్చే ఏడాది ఎలా అయినా గెలవాలి అన్న కసితో టీడీపీ,వైసీపీ, మరోవైపు జనసేన( Janasena ) పోటీ పడుతున్నాయి.

టీడీపీ( TDP ) నాయకులు టీడీపీ నేతలు వచ్చే ఏడాది తప్పకుండా మేమే గెలుస్తామో అన్న ధీమాను వ్యక్తం చేస్తుండగా, వైసీపీ కూడా ఏమాత్రం తగ్గకుండా మేము తప్పకుండా గెలిచి చూపిస్తాము అంటూ శబధాలు చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఏపీ సీఎం జగన్( CM Jagan ) విషయానికి వస్తే జగన్ ఎలా అయినా మళ్ళీ అధికారంలోకి రావాలి అని గట్టిగానే కృషి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మరోసారి ప్రజలకు తాను ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా జగన్ ఒక కొత్త రూట్ ని వెతుకునట్లు తెలుస్తోంది.

అదేమిటంటే యాగాలు, దేవుడు.ఏపి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో( Indira Gandhi Municipal Stadium ) ఈనెల 12 నుండి 17 వరకూ నిర్వహిస్తన్న రాజశ్యామల యాగంపై విపక్షాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తన్నాయి.

"""/" / ఆ యాగాన్ని రాష్ట్రం పాడిపంటలతో సుభీక్షంగా ఉండేందుకు చేస్తున్నామని చెపుతున్నప్పటికీ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యేందుకే ప్రభుత్వ ఖర్చుతో ఈ యాగం చేస్తున్నారని విపక్షాలు అంటున్నాయి.

ఏపీ సీఎం జగన్ మళ్ళీ వచ్చే ఏడాది తానే సీఎం అయ్యేందుకు రాజశ్యామల యాగం చేశానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) చెప్పడంతో పాటు రెండవ సారి ఎన్నికలకు ముందు ఈ యాగాన్ని తన పామ్ హౌస్ లో నిర్వహించారు.

తరువాత ఎన్నికల్లో గెలిచిన ఆయన సహస్ర ఛండీయాగాన్ని సైతం నిర్వహించారు.కేసిఆర్ యాగం చేసిన ప్రతిసారి విజయం సాధిస్తూ రావడంతో ఈ యాగం తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండ్ సెట్ గా మారింది.

"""/" / దాంతో తాజగా ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్( BRS ) కార్యాలయాన్ని ప్రారంభించిన కేసిఆర్ అక్కడ కూడా రాజశ్యామల యాగాన్ని శారదా పీఠం, స్వరూపానందేంద్ర పర్యవేక్షణలో పూర్తిచేశారు.

దీంతో కేసిఆర్ తరహలోనే సీఎం జగన్ కూడా ఈ యాగాన్ని నిర్వహింప చేస్తే తిరిగి అధికార పీఠం దక్కుతుందని భావించి ఇప్పుడా దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా దేవుని సోమ్ము, జనం సొమ్ముతో చండి రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మి మహ యజ్జం చేయాలని జగన్ నిర్ణయించుకోవడం విమర్శలకు తావిస్తోంది.

ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రాజశ్యామల యాగానికి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విస్తుత ఏర్పాట్లు చేసేందుకు అన్ని శాఖల కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

ఈ యాగానికి రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నారని దానిలో రూ.

2.5 కోట్లు తిరుమల తిరుపతి దేవస్ధానం నుండి వస్తున్నాయని విపక్షాలు అంటున్నాయి.

ముఖ్యమంత్రి తన సొంత డబ్బులతో రాజశ్యామల యాగం చేయిస్తే తప్పులేదని ప్రభుత్వ ధనంతో ఎలా చేయిస్తారు అంటూ ప్రతిపక్ష నాయకులు, ప్రశ్నిస్తున్నారు.

కన్నడంలో ప్రసంగం .. కెనడా ప్రధాని రేసులో దూకిన భారత సంతతి ఎంపీ