జగన్ ఢిల్లీ ధర్నా ఎఫెక్ట్ … ఆ భవన్ గేట్లు మూసివేత

ఏపీలో టీడీపీ ,కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైసిపి నేతలే టార్గెట్ గా చేస్తున్న దాడులకు నిరసనగా ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్( Jantar Mantar ) వద్ద వైసీపీ అధినేత,  ఏపీ మాజీ సీఎం జగన్( Jagan ) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా తమతో కలిసివచ్చే పార్టీలన్నిటితో కలిసి పోరాటం చేపడుతున్నారు.దేశవ్యాప్తంగా ఏపీ వ్యవహారంపై చర్చ జరిగేలా జగన్ వ్యవహత్మకంగా ఈ ధర్నాకు పిలుపునిచ్చారు.

వైసిపి ఎమ్మెల్యేలు,  మాజీ ఎమ్మెల్యేలు , ఎంపీలు , ఎమ్మెల్సీలు,  కీలక నాయకులు అందరితోనూ ఈ ధర్నా కార్యక్రమంలో జగన్ పాల్గొంటున్నారు.

దీంతో ఏపీ వ్యాప్తంగా జగన్ చేపట్టిన ధర్నా కార్యక్రమం పై ఆసక్తి నెలకొంది.

"""/" / ఇది ఇలా ఉంటే జగన్ ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో,  ఢిల్లీలోని ఏపీ భవన్( AP Bhavan ) వద్ద అధికారులు అప్రమత్తం అయ్యారు .

ముందస్తుగా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఏపీ భవన్ గేట్లు మూసి వేయడంతో పాటు,  పరిసర ప్రాంతాల్లో పూర్తిగా నిషేధ ఆజ్ఞలను అమల్లోకి తీసుకువచ్చారు.

ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని , లా అండ్ అదుపు తప్పిందని,  వెంటనే రాష్ట్రపతి జోక్యం చేసుకుని ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు.

"""/" / రాష్ట్రంలో శాంతి భద్రతలను  పరిరక్షించడంలో చంద్రబాబు( Chandrababu ) ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ,  రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.

ఏపీలో వైసిపి నేతలు,  కార్యకర్తలపై జరిగిన దాడుల ఫోటోలు,  వీడియోలను గ్యాలరీ రూపంలో ప్రదర్శించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇటీవల పల్నాడు జిల్లాలోని వినుకొండలో దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు నిరసనగా ఢిల్లీలో ఆందోళన చేపడుతామని  ముందుగానే జగన్ ప్రకటించిన నేపథ్యంలో,  ఈరోజు జరుగుతున్న ధర్నా కార్యక్రమం కు అధికారులు అనేక ఆంక్షలు విధించారు.

ఏపీ భవన్ మూసి వేయడం తో పాటు , పరిసర ప్రాంతాల్లోనూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అంటూ వచ్చేసిన క్లారిటీ.. ఆ రేంజ్ లో నట విశ్వరూపం చూపిస్తారా?