స‌ర్దుకుపో అన్నా అంతా మ‌నోళ్లే.. ఆమంత్రిపై జ‌గ‌న్ సానుభూతి !

కొన్ని విష‌యాలు చిత్రంగా ఉంటాయి.మ‌రికొన్ని మ‌రీ చిత్రంగా ఉంటాయి.

రెండో కేట‌గిరీకి చెందిన విష‌యమే ఇప్పుడు వైసీపీలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.అదేంటంటే.

ఇటీవ‌ల ఏపీ స‌ర్కారు కేబినెట్ భేటీ జ‌రిగింది.అంతా అయిపోయింది.

వివిధ విష‌యాల‌పై మంత్రులు, సీఎం మాట్లాడుకున్నారు.మొత్తంగా కొలిక్కి వ‌చ్చేసింది.

అనంత‌రం అంద‌రూ ఓకేనా  బై అని సీఎం ముగించ‌బోతున్నారు.ఇంత‌లో త‌న సొంత జిల్లా క‌డ‌ప‌కు చెందిన మైనారిటీ వ్య‌వ‌హారాల మంత్రి అంజాద్ బాషా చెయ్యి పైకెత్తారు.

సార్ మీతో ఒక మాట‌! అన్నార‌ట‌.దీనికి జ‌గ‌న్‌.

రిప్ల‌య్ విని మిగిలిన మంత్రులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశార‌ని వైసీపీ నేత‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

విష‌యం ఏంటంటే జిల్లాలో ఉన్న ఏకైక మంత్రి అంజాద్ బాషానే.సీఎం జ‌గ‌న్ త‌ర్వాత ఆయ‌నే జిల్లాలో మంత్రిగా ఉన్నారు.

దీంతో ఆయ‌నపై జిల్లాలో చాలానే ఆశ‌లు ఉన్నాయి.ముఖ్యంగా మైనార్టీ వ‌ర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆశ‌లు పెట్టుకున్నాయి.

ఆయ‌న ఏదో చేస్తారు.త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి.

అనుకున్నారు.కానీ, ఎక్క‌డా బాషా దూకుడు లేదు.

పైగా ఆయ‌న ఎక్క‌డా జోక్యం చేసుకోలేదు.ఎవ‌రితోనూ మాట్లాడే ప్ర‌య‌త్నం చేసినా.

ఆయ‌న మాట‌ను అధికారులు కూడా వినీ విన‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.దీంతో బాషాపై ఆయ‌న సామాజిక వ‌ర్గంలోనే తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది.

దీనిపై ఇప్ప‌టికే ఆయ‌న తీవ్ర మ‌ద‌‌నం చెందుతున్నారు. """/"/ ఈ క్ర‌మంలో అంజాద్ బాషా.

కొన్నాళ్లుగా తీవ్ర మ‌థ‌నం చెందుతున్నారు.ఇదే విష‌యాన్ని ఆయ‌న ఏకంగా సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నించాల‌ని అనుకున్నారు.

దీనికి కేబినెట్ భేటీ అనంత‌రం సీఎంతో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించారు.అయితే.

బాషా మాట్లాడేలోపే సీఎం జ‌గ‌న్ క‌లుగ జేసుకుని  ``స‌ర్దుకు పో  అన్నా అంతా మ‌నోళ్లే!!`` అనేశార‌ట‌.

దీంతో అవాక్క‌యిన మంత్రి బాషా ఇంకేమీ మాట్లాడలేక పోయార‌ని వైసీపీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు.

అంటే సీఎం జ‌గ‌న్‌కు త‌న జిల్లాలో ఎవ‌రు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారో తెలుసున‌ని ఆయ‌నకు అంతా అవ‌గాహ‌న ఉంద‌ని.

అదేవిధంగా ప్ర‌తిజిల్లాపైనా ఆయ‌న‌కు నివేదిక‌లు అందుతున్నాయ‌నే విష‌యం వాస్త‌వ‌మేన‌ని వైసీపీ నేత‌లు చ‌ర్చించుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు : కెనడా కోర్టు ఎదుట హాజరైన నాలుగో అనుమానితుడు