ఎన్నికల ఫలితాలే రాలేదు... అప్పుడే క్యాబినెట్ ఏంటి జగన్

ఎన్నికల ఫలితాల తర్వాత అధికారంలోకి వచ్చే పార్టీ సామాజిక సమీకరణాలు, రాజకీయ అవసరాలు బట్టి గెలిచినా ఎమ్మెల్యేలలో కొందరికి మంత్రి పదవులు ఇస్తూ ఉంటారు.

ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది.ఇక మంత్రి పదవులు ఇచ్చే సమయంలో ఆశావాహులు ఎక్కువ మంది ఉన్న పార్టీ అధినేతలు అందరికి ఏదో ఓక కారణం చెప్పి వారికి సర్ది చెప్పి నిర్ణయించుకున్న వారికే మంత్రి పదవులు ఇస్తారు.

దీనికి ముందుగా ప్రణాళిక వేసుకోకపోయినా, గెలిచినా తర్వాత ఒక నెలరాజులు సమయం తీసుకొని క్యాబినెట్ ఏర్పాటు జరుగుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఏపీ ఎన్నికలలో ఫలితాలు ఇంకా రాకముందే తాము ఈ సారి ఎలా అయిన అధికారంలోకి వస్తామనే గట్టి నమ్మకంతో ఉన్న వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే క్యాబినెట్ మంత్రులని నిర్ణయించినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

గెలుపుపై చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్న జగన్ తన క్యాబినెట్ మంత్రుల లిస్టు కూడా సిద్ధం చేసి పార్టీలో అందరికి చేరవేసారనే సమాచారం వినిపిస్తుంది.

తాజాగా వైసీపీ క్యాబినెట్ మంత్రుల లిస్టు ఒకటి బయటకి వచ్చింది.ఇప్పుడు ఇది కాస్తా పొలిటికల్ సర్కిల్ లో సంచలనంగా మారింది.

అయితే తాజా ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పలేకపోతున్నారు.

కాని వైసీపీ మాత్రం చాలా ధీమాగా ఉండటం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి.

కెనడా గురించి షాకింగ్ కామెంట్లు చేసిన కంటెంట్ క్రియేటర్.. వీడియో వైరల్..