అప్పుల ప్రభుత్వం అంటూ విపక్షాలు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చిన జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష పార్టీలకు చెందిన నాయకులు గత కొన్ని రోజుల నుండి వైసీపీ ప్రభుత్వం తెగ అప్పులు చేస్తోంది అంటూ అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు.

ఇష్టానుసారంగా అప్పులు చేస్తూ.పరిపాలన గాలికొదిలేశారని అనేక రీతులుగా వైసీపీ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం జరిగింది.

ఇటువంటి తరుణంలో అప్పులు అంటూ విమర్శలు చేసిన విపక్షాలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు ఏపీ సీఎం జగన్.

ప్రస్తుత ప్రపంచంలో ప్రజలను కాపాడుకోవడానికి మంచి చేయడానికి.దానిని అభివృద్ధిగా మలచడానికి అప్పో సొప్పో చేస్తూ.

ప్రజలకు సహకారం అందించేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంటే దానిని నెగిటివ్ గా చూపించడానికి రాష్ట్రంలో ప్రతి పక్షాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇటువంటి ప్రతిపక్షాలు ఏ రాష్ట్రంలో ఉండవని మన రాష్ట్రం లోనే ఉన్నాయని జగన్ అసహనం వ్యక్తం చేశారు.

అదే రీతిలో పండ్లు పండ్ల చెట్టు మీద నేరాలు ఎక్కువ పడతాయి అనే సామెతను బలంగా నమ్ముతాను.

అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలకు తమ ప్రభుత్వం ఇంత మంచి చేస్తుందన్నే.ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయి అని .

అయినా కానీ ప్రజలకు మంచి చేసి తీరుతామని జగన్ స్పష్టం చేశారు.

సైకిల్ పై వెళ్తున్న అమ్మాయిని టీజ్ చేసిన అబ్బాయి.. చివరకు? (వీడియో )