సంక్షేమంపై జగన్ ధీమా గట్టెక్కిస్తుందా ?
TeluguStop.com
ఎన్నికలకు దగ్గరకు వస్తున్నందున కేంద్రంలోనూ రాష్ట్రాలలోనూ ఎన్నికల హడావుడి కనిపిస్తుంది ఒక వైపు ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలు పై ప్రజల్లో భారీ ఎత్తున ప్రచారం చేస్తుంటే మరోపక్క అధికార పక్షాలు అభివృద్ధిపై తమదైన విశ్వాసాన్ని చూపిస్తున్నాయి.
ఒకపక్క కేంద్రంలో ప్రతిపక్షాలన్నీ తమకు వ్యతిరేకంగా కూటమి కట్టడంతో జాగ్రత్త పడుతున్న బాజాపా తన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నిటినీ ఏకం చేసి యూపీఏ కూటమి ని ఎదుర్కొనే పనిలో పడింది.
ఎన్నికలు వస్తున్న ప్రతి రాష్ట్రంలోనూ సాక్షాత్తు ప్రదాన మంత్రితో సహా ప్రజల్లో తిరుగుతూ సభలు సమావేశాలలో కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ భాజపా గెలుపు కోసం కృషి చేస్తున్నారు.
పక్కనే ఉన్న తెలంగాణలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా కూడా చిన్న పామును కూడా పెద్దకర్ర తో కొట్టాలన్న సంకల్పంతో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ,ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనేక వర్గాలకు వరాల జల్లు కురిపిస్తున్న కేసీఆర్ 2024( CM KCR ) లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని రిపీట్ చేయాలనిపట్టుదల తో ఉన్నారు.
"""/" /
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేకతను భారీ ఎత్తున ప్రచారం చేస్తూ గత ఆరు నెలలుగా ప్రజల్లోనే తిరుగుతున్నప్పటికీ అధికార పక్షాన నుంచి ఆ హడావుడి అసలు కనిపించడం లేదు.
తమ సంక్షేమ పథకాల్లో( Welfare Schemes ) తమను గెలిపిస్తాయన్న ధీమా లో ఉన్న జగన్ అసలు ప్రజల వైపు కన్నెత్తి చూడడం లేదు .
ఇంటింటికి ప్రభుత్వం పేరుతో మంత్రులను ఎమ్మెల్యేలను తిప్పుతున్నారు తప్ప ప్రభుత్వం పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఎక్కడకక్కడ తిప్పికొట్టే చర్యలను చేపట్టడం లేదు.
చెప్పుకోవడానికి 25 మంది మంత్రులు ఉన్నప్పటికీ అందులో ప్రతిపక్షాలపై గట్టిగా మాట్లాడుతున్న మంత్రులను వేళ్లపై లెక్క పెట్టవచ్చు.
వీరు కూడా ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడానికి ప్రాధాన్యతిస్తున్నారు తప్ప ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టడంలో, జరుగుతున్న మంచిని వివరించడంలో, అంకెలను వివరించడానికి పెద్దగా దృష్టి పెట్టడం లేదు .
"""/" /
దాంతో గ్రౌండ్ లెవెల్ లో ప్రభుత్వ వ్యతిరేకత అంచలంచలుగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ వైసీపీ పార్టీ మేలుకొనడం లేదని వైసిపి హార్డ్ కోర్ ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయి అన్న ధీమాలో ఉన్న జగన్ ప్రతిపక్షాలు చేస్తున్న హడావుడిని అసలు పట్టించుకోకుండా లైట్ తీసుకోవడం అతి విశ్వాసమో - ఆత్మవిశ్వాసమో తెలియని అయోమయ పరిస్థితిలో శ్రేణులు ఉన్నట్లుగా తెలుస్తుంది పరిపాలన ఎంత బాగున్నప్పటికీ ఎన్నికల వేల ప్రజల మూడ్ ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండకపోతే పరిస్థితులు వ్యతిరేఖం గా మారిపోతయేమో అన్నది వైసిపి ముఖ్య నేతలు ఆలోచన .
మరి 2024 లో జగన్ ధీమా గెలిపిస్తుందో లేదో చూడాలి
.
అట్లీ లుక్ పై కామెంట్లు చేసిన బాలీవుడ్ కమెడియన్.. ఈ బాలీవుడ్ నటుల తీరు మారదా?