ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం.. 100 అడుగుల వైయస్సార్ విగ్రహం పెడతాం

ఆంధ్రప్రదేశ్ ప్రజల కల పోలవరం.ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పోలవరం పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.

నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశలో పోలవరం ప్రాజెక్ట్ పై అధికార, ప్రతి పక్ష పార్టీల మధ్య చర్చ నడిచింది.

టి‌డి‌పి నేత చంద్రబాబు మాట్లాడుతూ.రాజధానిని తరలించడంపైన ఉన్న శ్రద్ద పోలవరం పై లేదు.

ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి అన్నారు.జగన్ మాట్లాడుతూ.

గతంలో టి‌డి‌పి ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు చంద్రన్న పోలవరం టూర్ తో 83 కోట్లు వృదా ఖర్చు చేసిందని.

పోలవరం సందర్శనానికి వచ్చిన మహిళా కార్యకర్తలు చంద్రన్న బజన చేస్తూ పాటలు పాడారు తప్ప పోలవరం పనిని మాత్రం పూర్తి చెయ్యలేదు.

ఆ మహిళా కార్యకర్తలు చంద్రబాబు పై పాడిన బజన పాటను జగన్ అసెంబ్లీ లో ప్లే చేశారు.

ఆ వీడియో ని చూసి జగన్ నవ్వుకున్నాడు.ఈ నేపథ్యంలోనే జగన్ మాట్లాడుతూ పోలవరం వై‌ఎస్ రాజశేకర్ రెడ్డి ఆశయం.

ఆయన ఆశయం మేరకు ఒక్క ఇంచు కూడా తగ్గకుండా పోలవరం డ్యామ్ కట్టి తీరుతామ్ అన్నాడు.

అక్కడే 100 అడుగుల వై‌ఎస్‌ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతాము అన్నాడు.అనుకున్న టైమ్ లో పోలవరం పూర్తి అవుతుందని జగన్, చంద్రబాబు కు గుర్తుచేశాడు.

పోలవరం గత ప్రభుత్వం హయాంలోనే పూర్తి అవ్వాలి కానీ చంద్రబాబు నిర్లక్ష్యం వలనే లేట్ అయ్యిందని చెప్పాడు.

సీమతో పాటు ఆ జిల్లాల ప్రజలే వైసీపీని గెలిపించనున్నారా.. అక్కడ క్లీన్ స్వీప్ చేస్తుందా?