యాక్షన్ మోడ్లో జగన్?
TeluguStop.com
ప్రజాభిమానం పెంచుకున్న వారికే టికెట్లు ఉంటాయని, ప్రజల అవసరాలకు , ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు ఇప్పటికే దిశానిర్దేశం చేసిన జగన్( YS Jagan Mohan Reddy ) ఇప్పుడు మాట వినని నేతలపై కొరడా ఝులిపిస్తున్నట్లుగా తెలుస్తుంది.
ప్రజల్లో పరపతి లేని నేతలకు ఎట్టి పరిస్థితిలో టికెట్లు లేవని ముందుగానే చెప్పిన జగన్ ఇప్పుడు యాక్షన్ షురూ చేశారట .
ఆ దిశగా మొదటి వికెట్ కర్నూలు జిల్లా మంత్రి గుమ్ములూరు జయరాం ( Gummanuri Jayaram )దే నని వార్తలు వస్తున్నాయి.
"""/" / గత కొంతకాలంగా అనేక విమర్శలను ఎదుర్కొంటున్న జయరాం వ్యవహార శైలి పై , కార్యకర్తల తో పాటు అధిష్టానం కూడా అసంతృప్తిగా ఉన్నప్పటికీ సరైన ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఆయనను కొనసాగించారని తెలుస్తుంది.
అయితే ఇప్పుడు మరో ప్రభావంతమైన నేతను పార్టీలోకి తీసుకురావడంలో విజయవంతమైన వైసీపీ అధిష్టానం ఇప్పుడు గుమ్ములూరు జయరాం కు ఉద్వాసన పలికే దిశగా ఆలోచనలు చేస్తుంది అంటున్నారు.
"""/" / తెలుగుదేశం పార్టీలో కీలక నేత అయిన కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు కుమార్తె కప్పట్రాళ్ల బుజ్జమ్మని వైసిపి( Kappatralla Bojjamma ) పార్టీ ఆకర్షించగలిగింది.
గత నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ కుటుంబం తమ కుటుంబ ప్రత్యర్ధులు టిడిపిలో చేరడంతో వైసిపి ని ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది .
ఎమ్మెల్యే టికెట్ పై స్పష్టమైన హామీ తోనే కప్పట్రాళ్ల బుజ్జమ్మని చేర్చుకున్నారని తెలుస్తుంది .
గుమ్ములూరు జయరాం కి కర్నూల్ ఎంపీ సీట్లు ఆఫర్ చేస్తున్నారని అయితే మంత్రి అందుకు సుముఖంగా లేరని కూడా వార్తలు వస్తున్నాయి .
అయితే గత కొంతకాలంగా జయరాం వ్యవహార శైలి పై అసంతృప్తి తో ఉన్న అధిష్టానం ఆయనకు ఆయనను పక్కన పెట్టేందుకే ఆల్టర్నేటివ్ ని తయారు చేసిందని వార్తలు వస్తున్నాయిఆమె వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, కప్పట్రాళ్ల కుటుంబానికి ఉన్న అనుచర గణం మద్దతు కూడా ఉండడంతో ఆమె గెలుపు కచ్చితం అని బావిస్తున్నఅధిష్టానం నియోజకవర్గ బాధ్యతలు కూడా ఆమెకు కట్టబెట్టినట్లుగా తెలుస్తుంది.
కోట్ల ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన భాస్కర్ రావు.. మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!