రేపటితో ముగియనున్న జగన్ బస్సు యాత్ర… చివరి రోజు షెడ్యూల్..!!

వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) చేపట్టిన "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర జోరుగా సాగుతోంది.

మార్చి నెల చివరిలో ఇడుపులపాయల ప్రారంభమైన బస్సు యాత్ర.రేపు ఇచ్చాపురంలో ముగియనుంది.

ఈ క్రమంలో బస్సు యాత్ర చివరి రోజు షెడ్యూల్ సీఎంవో కార్యాలయం విడుదల చేయడం జరిగింది.

బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు అక్కివలస.రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభం కానుంది.

ఎచ్చెర్ల, కుశలాపురం, శ్రీకాకుళం బైపాస్, పలివలస, నరసన్నపేట క్రాస్, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పశురాంపురం చేరుకుంటారు.

మధ్యాహ్నం 12 గంటలకు పశురాంపురం జంక్షన్( Pashurampuram Junction ) వద్ద సీఎం జగన్ విరామం తీసుకుంటారు.

"""/" / అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు లంచ్ క్యాంపు నుంచి అక్కవరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు బయలుదేరుతారు.

సాయంత్రం 4:20 నిమిషాలకు.సభ ప్రాంగణానికి చేరుకుంటారు.

5:20 వరకు సభలో ప్రసంగించనున్నారు.ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అక్కవరం హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు.

అక్కడ నుంచి హెలికాప్టర్ లో విశాఖపట్నం విమానాశ్రయానికి వెళ్ళనున్నారు.సాయంత్రం 6:15 నిమిషాలకు విశాఖపట్నం విమానాశ్రయంకు చేరుకొనున్నారు.

6:30 గంటలకు విశాఖపట్నం నుంచి గన్నవరం విమానాశ్రయంకు వెళ్లనున్నారు.7:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.

సాయి ధరమ్ తేజ్ మిస్ చేసుకున్న మూడు బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇవే… !