షర్మిల కు ఇబ్బందికరంగా మారిన జగన్ ? 

తెలంగాణలో అధికారం సాధించడమే ఏకైక లక్ష్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు.

గత కొద్దిరోజులుగా షర్మిల  పేరు తెలంగాణలో మారుమోగుతోంది .ప్రగతి భవన్   ముట్టడించేందుకు షర్మిల చేసిన ప్రయత్నాలను తిప్పుకొట్టేందుకు ప్రభుత్వం ఆమెను అరెస్టు చేయించడం తదితర పరిణామం తర్వాత, షర్మిల మరింతగా యాక్టివ్ అయ్యారు.

టిఆర్ఎస్ మంత్రులు,  ఎమ్మెల్యేలు కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేస్తున్నారు.

  దీనికి టిఆర్ఎస్ నుంచి అంతే స్థాయిలో ప్రతిస్పందన వస్తోంది.ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ అంశం కూడా ప్రస్తావనకు వస్తోంది.

టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని షర్మిల విమర్శలు చేస్తున్న క్రమంలో,  ఏపీలో మీ అన్న పరిపాలన సంగతి ఏమిటని మీరు తమను ప్రశ్నిస్తే , తాము జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి వస్తుందంటూ టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు జగన్ కూ ఇబ్బందికరంగా మారాయి.

 తెలంగాణలో షర్మిలకు జగన్ అంశం ఎంత స్థాయిలో ఇబ్బందికరంగా మారిందో , అంతే స్థాయిలో జగన్ కు షర్మిల వ్యవహారం ఇబ్బందికరంగా మారింది.

ముఖ్యంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి షర్మిల ను టార్గెట్ చేస్తున్నారు.

ప్రజాప్రస్థానం పాదయాత్ర పేరుతో నియోజకవర్గ ఎమ్మెల్యేలను నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ షర్మిల పరిధి దాటుతున్నారని,  ఒక మహిళ కదా అని ఓపికగా ఉంటే విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు.

ఈ సందర్భంగా జగన్ ను ఆయన టార్గెట్ చేసుకున్నారు.ఏపీలో జగన్ ప్రభుత్వంలో సమస్యలు లేవా అంటూ ఆయన ప్రశ్నించారు.

షర్మిల ఈ విధంగా వ్యాఖ్యానించడం వెనక బిజెపి హస్తం ఉందని,  నర్సంపేట నియోజకవర్గానికి వచ్చి తన వ్యక్తిత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు షర్మిలకు ఎక్కడ ఉందని సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు.

  తన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ మీ ముందు ఉంచుతాం.మీ ఆస్తులను కూడా ప్రజల ముందు పెట్టండి అంటూ సుదర్శన్ రెడ్డి సవాల్ చేశారు.

షర్మిల పాదయాత్రను తెలంగాణ ప్రజలు ఆపుతారని , ప్రభుత్వం లో ఏమైనా తప్పులు ఉంటే సబ్జెక్టు పరంగా మాట్లాడితే స్వాగతిస్తామని,  కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే సహించేది లేదని సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    """/"/ షర్మిల ఇక్కడ ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడితే తాము ఏపీలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుందని, వైయస్ జగన్ ప్రభుత్వం పై మీలాగే తాము మాట్లాడుతామని సుదర్శన్ రెడ్డి అన్నారు.

తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉందని చెబుతున్న షర్మిల ముందు కృష్ణ,  గోదావరి నదులపై నీటి వాటా ఎంత ఉందో తేల్చమని మీ అన్న జగన్ను బిజెపి పెద్దలను అడగాలంటూ వ్యాఖ్యానించారు.

మొత్తంగా తెలంగాణలో షర్మిల ఎంత యాక్టివ్ అయితే అంతగా ఏపీలో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చి పడతాయనే విషయం ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది.

 .

కార్మికులను బెల్టుతో ఇష్టానుసారం కొట్టిన చైనా వ్యక్తి.. వైరల్ వీడియో…?